సౌత్ డైరెక్టర్లతో సంచలన హీరో భారీ లైనప్!
అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు కానీ పాన్-ఇండియా మార్కెట్‌పై షారుక్ పట్టును మరింత పటిష్టం చేసుకోవడానికి దక్షిణాది మాస్ పల్స్ తెలిసిన క్రియేటర్లతో పని చేయడమే సరైన మార్గమని బాద్‌షా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వ్యూహాలు ఎప్పుడూ అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం షారుక్ సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకులతో ప్రాజెక్ట్‌లను సెట్ చేసే పనిలో నిమగ్నమైనట్లు వార్తలొస్తున్నాయి.
అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు కానీ పాన్-ఇండియా మార్కెట్‌పై షారుక్ పట్టును మరింత పటిష్టం చేసుకోవడానికి దక్షిణాది మాస్ పల్స్ తెలిసిన క్రియేటర్లతో పని చేయడమే సరైన మార్గమని బాద్‌షా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ-షారుక్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన జవాన్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఆ సినిమా తెచ్చిన భారీ సక్సెస్ ..అట్లీ మేకింగ్‌పై ఉన్న నమ్మకంతోనే బాద్‌షా ఆయనకు రెండవసారి అవకాశం ఇస్తున్నారు. తదుపరి ఇద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం ఉంటుందనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతోంది. ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `రాకా` బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే ఆయన ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ తెలివిగా అట్లీని మళ్లీ లైన్ లోకి తెస్తున్నారు.
అలాగే షారుక్ ఐ శాండల్‌వుడ్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై కూడా పడింది. ఇద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ డ్రామాను సెట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. `కెజియఫ్` సిరీస్‌తో భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో `డ్రాగన్` చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సాధిస్తే? నీల్ ఇమేజ్ ఆకాశన్నే అంటుంతుంది. ఇలా సౌత్ మాస్ ఎలివేషన్స్, లార్జర్-దన్-లైఫ్ శైలి మేకింగ్‌కు షారుక్ ఖాన్ అంతర్జాతీయ స్టార్‌డమ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం.
అట్లీ అందించే కమర్షియల్ డ్రామా, ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్ యాక్షన్ రెండు వేర్వేరు కోణాల్లో షారుక్ నటనా విశ్వరూపాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అగ్ర దర్శకులను ఒకేసారి రంగంలోకి దించే మాస్టర్ ప్లాన్ తో షారుక్ ముందుకెళ్తున్నారు.
మొత్తానికి సౌత్ డైరెక్టర్ల ప్రతిభను, వారి ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని షారుక్ ఖాన్ డిజైన్ చేస్తున్న భారీ లైనప్ బాలీవుడ్‌లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.`జవాన్` తో మొదలైన సౌత్ కాంబినేషన్ ప్రయాణం అట్లీతో రెండో సినిమా , ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ద్వారా భారతీయ చిత్రసీమలో సరికొత్త రికార్డులను నెలకొల్పడానికి వాళ్లతో షారుక్ ప్రాజెక్ట్ లు ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి లీడ్ ను కొంచెం మార్చి అందింగచలరు అవకాశం ఉంటుంది.