కలెక్షన్ కింగ్ ను నాన్ స్టాప్ గా చూసే రోజులొస్తాయా?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ఒకప్పుడు పవర్‌ ఫుల్ డైలాగ్స్‌ కు, స్పెషల్ యాటిట్యూడ్‌ కు కేరాఫ్ అడ్రస్. హీరోగా చేసిన సినిమాలతో పాటు, వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసినా తన మార్క్ చూపించేవారు.

Update: 2026-09-14 17:30 GMT

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ఒకప్పుడు పవర్‌ ఫుల్ డైలాగ్స్‌ కు, స్పెషల్ యాటిట్యూడ్‌ కు కేరాఫ్ అడ్రస్. హీరోగా చేసిన సినిమాలతో పాటు, వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసినా తన మార్క్ చూపించేవారు. యమదొంగ, బుజ్జిగాడు సినిమాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. హీరో కాకపోయినా.. మోహన్ బాబు స్క్రీన్ పై కనిపిస్తే ఆ సీన్ ను స్పెషల్ వెయిట్ వచ్చేది. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకునేవి.

అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితి కాస్త మారింది. మోహన్ బాబు నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. ఆయన పాత్రలు కూడా గతంలో లాగా హాట్ టాపిక్ గా కూడా మారలేదు. సన్ ఆఫ్ ఇండియా, శాకుంతలం, కన్నప్ప, శ్రీనివాస మంగాపురం వంటి సినిమాల్లో ఆయన కనిపించినా.. అవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయాయి.

ముఖ్యంగా మోహన్ బాబు లీడ్ రోల్ లో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా 2022లో విడుదలై అనుకున్న రేంజ్ లో రిజల్ట్ అందుకోలేదు. 2023లో వచ్చిన శాకుంతలంలో ఆయన దుర్వాస మహర్షిగా కనిపించారు. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఇక కన్నప్పలో కీలక పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతల్లోనూ భాగమయ్యారు. అయినప్పటికీ ఆ సినిమా కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది.

ఇలా వరుసగా సినిమాలు నిరాశపరుస్తున్న సమయంలో ఇప్పుడు మోహన్ బాబు చూపు ది ప్యారడైజ్ పై ఉంది. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మోహన్ బాబు విలన్‌ గా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

అదే సమయంలో దసరాతో తనదైన మేకింగ్, రా ట్రీట్మెంట్ చూపించిన శ్రీకాంత్ ఓదెల.. మోహన్ బాబును ఎలా ప్రజెంట్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడి నుంచి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్‌ ను దర్శకుడు రాబట్టగలిగితే.. ఆ రోల్ సినిమాకు పెద్ద హైలెట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. ది ప్యారడైజ్ మంచి విజయం సాధిస్తే అది నాని, శ్రీకాంత్ ఓదెలకు మాత్రమే కాదు.. మోహన్ బాబుకు కూడా ఇంపార్టెంటే.

చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక స్ట్రాంగ్ రోల్, మంచి హిట్ దక్కితే.. మళ్లీ వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా పవర్‌ ఫుల్ క్యారెక్టర్స్ చేయగల నటుడిగా మోహన్ బాబుకు మరోసారి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ప్యారడైజ్ హిట్ అయితే.. మళ్లీ మోహన్ బాబును నాన్‌ స్టాప్‌ గా స్క్రీన్ పై చూసే రోజులు వస్తాయా? అనేది చూడాలి.

Tags:    

Similar News