హీరోల పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది... చాలా మంది విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి...
మనలో చాలా మందికి హీరో అవ్వాలనే కోరిక ఉంటుంది... ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మా జన్మ ధన్యమైపోతుందని అనుకునే వాళ్ళు ఉన్నారు.
మనలో చాలా మందికి హీరో అవ్వాలనే కోరిక ఉంటుంది... ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మా జన్మ ధన్యమైపోతుందని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు నువ్వు హీరోల ఉన్నావ్ అంటే చాలు మురిసిపోతుంటారు. కానీ ఒక సామాన్యుడు హీరోగా మారడానికి, స్క్రీన్ మీద కనిపించి మ్యాజిక్ చేయడానికి ఎంతలా కష్టపడాల్సి ఉంటుందనే విషయాన్ని మనలో చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు... సినిమాల్లో హీరోగా మారడానికి ముందు నీలో టాలెంట్ ఉండాలి, అవకాశం వచ్చేంత వరకు ఓపికగా ఎదురుచూడాలి. ఈ క్రమంలోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. జేబులో డబ్బులు ఉండవు, ఎలా ఉన్నావ్ అని అడిగే వాడు ఉండడు. అందరికీ నెలకొకసారి పండగ వస్తే సినిమా వాళ్ళకి మాత్రం షూటింగ్ ఉన్నప్పుడే పండగ... మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ లో మనిగడని కొనసాగిస్తూ చాలా మంది చేత చిదరించుకొని, చివాట్లు తిని, కాళ్లు చేతులు పట్టుకొని హీరో గా మారిన వాళ్ళకు ముఖ్యంగా స్వశక్తితో పైకి వచ్చిన వాళ్ళకు పొగరు ఉండటంలో తప్పులేదు... ఎందుకంటే సమాజం మొత్తం తనను ఎందుకు పనికి రాడని ముద్రవేసి దూరం పెట్టిన అవేవి పట్టించుకోకుండా ముందుకు సాగాడు. తన కళ ను నమ్ముకొని దానికోసం కష్టాలు పడుతూ, కన్నీళ్లను దిగమింగుతు ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో అయ్యాడు కాబట్టి హోదా ను ఎంజాయ్ చేస్తుంటాడు...
నిజానికి హీరోల లైఫ్ చాలా లగ్జరీ గా ఉంటుంది. కెరియర్ మొదట్లో ఇబ్బందులు పడినప్పుడు వాళ్ల లైఫ్ ఎంత దుర్భరంగా ఉంటుందో హీరో అయ్యాక దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది... కొందరు హీరోలైతే మాకంటే తోపులెవరు లేరు అనే రేంజ్ లో ఉంటారు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళకి కావాల్సింది వాళ్ల దగ్గర ఉంటుంది. ఎటు చూసిన లగ్జరీ లైఫ్ పార్టీలు తమ చుట్టూ ఉండే వాతావరణం మొత్తం ఒక రంగుల ప్రపంచం లాగా మారిపోతుంది. వాళ్ళు ఎవరితో సినిమా చేయాలి ఎలాంటి సినిమా చేయాలనేది నిర్ణయించుకుంటారు. వాళ్ళ డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు క్యూ కడతారు, బ్లాంక్ చెక్ లు ఇస్తారు. సినిమా కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంటాయి. సినిమాతో పాటు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏ టైమ్ లో ఏం చేయాలి అనేది పూర్తిగా వాళ్ల నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు ఉండరు...ఇలాంటి టైమ్ లో వాళ్ళు ఏ సినిమా చేసిన బ్లాక్ బస్టర్ అవుతుంది... పబ్లిక్ లోకి వెళ్తే చాలు వాళ్ళతో ఫోటోలు దిగడానికి ప్రేక్షకులు కొట్టుకు చస్తుంటారు ఆ క్రేజ్ న హీరోలుు ఎంజాయ్ చేస్తుంటారు...
ప్రేమలో పడటం పెళ్ళి చేసుకోవడం...
ఇలాంటి సమయంలోనే వాళ్లు తమ తోటి నటీమణులను ప్రేమించడమో లేదంటే వాళ్ళ పేరెంట్స్ బాధ భరించలేక ఆరెంజ్ మ్యారేజ్ చేసుకోవడమా ఏదో ఒకటి చేస్తారు. నిజానికి అసలైన ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎటు వెళ్ళిన ఏ మూవీ షూట్ లో ఉన్న సాయంత్రానికి ఇంటికి రావాలనే ఫోన్ వస్తుంది, ఏ విషయంలో అయిన ఓన్ గా డిసీజన్ తీసుకొనే ఛాన్స్ ఉండదు. తను ఏం చేసిన తన భాగస్వామి కి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేసిన కొంతమంది హీరోలకు ఇవి ఇబ్బంది అనిపించవచ్చు... దానివల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ ను వాళ్ళు పూర్తి స్థాయిలో గడపలేకపోతారు. ఈ క్రమంలోనే వాళ్ళకి ఏం చేయాలో తెలియక సినిమాల మీద పూర్తి ఏకాగ్రతను కేటాయించలేకపోతారు... తద్వారా ఆ సమయంలో వాళ్ళు చేసిన సినిమాలు ప్లాప్ అవుతుంటాయి. ఈ టైమ్ లో తన తోటి హీరోలు తనని బీట్ చేసి ముందుకు వెళ్తుంటారు... అదంతా చూసినా మన హీరో అసలు తన కెరియర్ ఎటు పోతుంది అని తనకి తాను ఆలోచనలో పడతాడు.
విడాకులు తీసుకోవడం...
ఫైనల్ గా దీనికంతటికీ కారణం ఏంటి అంటే ఇంట్లో ఉన్న తన వివాహ బంధమే అనే విషయాన్ని గమనిస్తాడు. వాళ్ళ వల్లే తను పూర్తి స్థాయిలో మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నానని అనుకుంటారు. తద్వారా విడాకులు తీసుకొని మళ్ళీ వాళ్ళు పూర్తి స్వాతంత్ర్య జీవితాన్ని గడపాలనుకుంటారు... అందరూ ఇలానే చేయరని కాదు కానీ కొందరి విషయంలో మాత్రం ఇదే జరుగుతుంది. అందుకే హీరోల వివాహబంధం ఎక్కువ కాలం నిలబడటం లేదు...