ఫోటోషూట్: సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స‌మంత‌కు సీమంతం

టాలీవుడ్ అగ్ర‌ క‌థానాయిక సమంత త్వరలో తల్లికాబోతున్న తరుణంలో త‌న‌ జీవితంలో మరపురాని క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-09-14 14:42 GMT

టాలీవుడ్ అగ్ర‌ క‌థానాయిక సమంత త్వరలో తల్లికాబోతున్న తరుణంలో త‌న‌ జీవితంలో మరపురాని క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సామ్‌కు ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో అత్యంత నిరాడంబరంగా.. సంప్రదాయబద్ధంగా సీమంతం (బేబీ షవర్) వేడుక జరిగింది. ఈ వేడుకలో మంగళస్నానాలు వంటి సాంప్రదాయ ఆచారాలు నిర్వహించగా... కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు త‌న భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు, శిల్పా రెడ్డి తదితరులు వేడుకలో పాల్గొని సందడి చేశారు.



 


ఈ ప్రత్యేక వేడుక గురించి సమంత స్పందిస్తూ.. మ‌న‌ సంప్రదాయంలో తల్లిని సాక్షాత్తు దేవిలా.. మరో కొత్త ప్రాణానికి రూపాన్నిచ్చే పవిత్ర సృష్టికర్తగా గౌరవించే తీరు తనను ఎంతగానో కదిలించిందని తెలిపారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆశీస్సులు లభించడంతో పాటు... ఒక మహిళగా తాను కూడా కొత్త రూపంలో పురుడు పోసుకుంటున్నానని స‌మంత‌ భావోద్వేగంతో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో రాజ్‌ని పెళ్లాడిన‌ సమంత ఈ ఏడాది జూన్‌లో తన ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు మాతృత్వపు ప్రయాణానికి సంబంధించిన ప్రతి అడుగును ఎంతో ఆనందంగా ఆస్వాధిస్తున్నారు.



 


సమంత రూత్ ప్రభు తన సీమంతం (వలైకాప్పు వేడుక)కు సంబంధించిన ఫొటోలను షేర్ చేయ‌గా.. అవి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి అపారమైన ప్రేమ ఆప్యాయ‌త‌ల‌ను అందుకుంటున్నాయి. సాధారణ ఫంక్షన్ హాళ్లలో జరిగే ఆధునిక పార్టీలకంటే భిన్నంగా.. సాంప్రదాయ పద్ధతిలో ఇంట్లోనే వేద మంత్రాలు- లైవ్ డివైన్ మ్యూజిక్ నడుమ జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుక అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.



 


సమంత వ్యక్తిగత ప్రయాణాన్ని ఎంతో కాలంగా గమనిస్తున్న అభిమానులు.. త‌న‌ జీవితంలోకి ఈ మధురమైన క్షణం రావడంపై భావోద్వేగానికి గురయ్యారు. తల్లిగా ఈ కొత్త ప్రయాణం మంగ‌ళ‌క‌రం కావాలని.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ నెటిజన్లు దిష్టి తగలకుండా ఉండే దిష్టి బొమ్మలతో పాటు ఎమోషనల్ కామెంట్స్ ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు.



 


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వ్యక్తిగతంగా-వృత్తిపరంగా అత్యంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లాడి.. ఇప్పుడిలా మాతృత్వపు మధురమైన క్షణాలను ఆస్వాధిస్తున్నారు. ఇక కెరీర్ పరంగానూ సమంత అద్భుతమైన విజయాలతో దూసుకెళుతున్నారు. సామ్ ప్రధాన పాత్రలో నటించి..స్వయంగా నిర్మించిన `మా ఇంటి బంగారం` చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను సాధించి ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో నటిగా తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడంతో పాటు.. కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు. ప్రస్తుతం చిన్నపాటి ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకున్నా భవిష్యత్తులో రాజ్ నిడిమోరు సృష్టికర్తగా తెరకెక్కుతున్న `రక్త బ్రహ్మాండ్` వంటి భారీ ప్రాజెక్ట్‌లతో పాటు మరిన్ని క్రేజీ ఆఫర్లతో తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మరింత శక్తివంతంగా కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.



 


Tags:    

Similar News