మోక్షు డెబ్యూ కాన్సెప్ట్.. హిట్ పర్సంటేజ్ ఎంత?

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది.

Update: 2026-09-15 05:53 GMT

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అసలు మోక్షు ఎలాంటి కథతో వస్తున్నాడన్నదే! స్టార్ హీరో బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న మోక్షజ్ఞకు తొలి సినిమాతోనే భారీ ఇంపాక్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాకుండా.. ఏకంగా పునర్జన్మల కాన్సెప్ట్‌ ను ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి బింబిసారతో తన మార్క్ చూపించిన మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ రేంజ్ లో నిర్మిస్తోంది. ప్రస్తుతం కథ, స్క్రీన్‌ ప్లేపై వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో పునర్జన్మల కాన్సెప్ట్ ఉంటుందనే వార్తే ఇప్పుడు అసలు హైప్‌ కు కారణం. ఎందుకంటే టాలీవుడ్‌ లో ఆ కాన్సెప్ట్‌ కు మంచి హిట్ పర్సంటేజే ఉంది.

గతంలో మూగమనసులు, మగధీర, మనం వంటి సినిమాలు పునర్జన్మల కథలను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చెప్పాయి. ఈగ కూడా పునర్జన్మ ఐడియాను పూర్తిగా కొత్త యాంగిల్ లో చూపించి భారీ విజయాన్ని అందుకుంది. అంటే కాన్సెప్ట్ పాతదే అయినా.. దాన్ని కొత్తగా చెప్పగలిగితే థియేటర్లలో మాస్ రెస్పాన్స్ రావడం ఖాయం. ఇప్పుడు అదే మ్యాజిక్‌ ను మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో చూపించబోతున్నారనే టాక్ హైప్ పెంచుతోంది.

ముఖ్యంగా వశిష్ఠ గతంలో సోషియో-ఫాంటసీ జానర్‌ ను సూపర్ గా డీల్ చేయడంతో.. ఈసారి కూడా స్టోరీని కేవలం పునర్జన్మల చుట్టూ కాకుండా భారీ వరల్డ్ తో లింక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. గత జన్మకు సంబంధించిన ఓ స్ట్రాంగ్ లింక్.. ప్రస్తుత జన్మలో మోక్షజ్ఞ రోల్ పై ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఆ గతానికి, ఇప్పటి కథకు మధ్య అసలు సంబంధం ఏంటి? అనే ఎలిమెంట్స్ సినిమాలో కీలకం కానున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఇక మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ కూడా సినిమాలో కనిపించనున్నారని టాక్. అది కూడా చిన్న క్యామియో కాదని.. కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల రన్ టైమ్ తో బాలయ్య రోల్ ఉండొచ్చనే ప్రచారం ఉంది. అంతేకాదు.. స్క్రీన్ పై తండ్రీకొడుకులుగానే కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్‌ లో మోక్షజ్ఞ తన స్టైల్‌ లో కథను నడిపిస్తే.. సెకండాఫ్‌ లో బాలయ్య ఎంట్రీతో థియేటర్ దద్దరిల్లేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక సినిమాలో పునర్జన్మ కాన్సెప్ట్ ఉందని మూవీ హిట్ అయిపోదు. కచ్చితంగా కథలో స్ట్రెంత్ ఉండాలి. స్క్రీన్‌ ప్లే అదిరిపోవాలి. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. విజువల్స్ కథకు తగ్గట్టుగా ఉండాలి. ఆ నాలుగు కూడా కుదిరితేనే మోక్షజ్ఞ డెబ్యూ ఓ రేంజ్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇలా మోక్షజ్ఞకు తొలి సినిమానే నార్మల్ డెబ్యూ కాకుండా భారీ కాన్సెప్ట్‌ తో రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News