0:07 టైమ్... 007 బాండ్..ఇదెలా సాధ్యమైంది!
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే పోరు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో? స్టాండ్స్‌లో మ్యాచ్ చూడటానికి వచ్చే సెలబ్రిటీల సందడి కూడా అంతే ఆకర్షణగా నిలుస్తుంది.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే పోరు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో? స్టాండ్స్‌లో మ్యాచ్ చూడటానికి వచ్చే సెలబ్రిటీల సందడి కూడా అంతే ఆకర్షణగా నిలుస్తుంది. తాజాగా జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో కూడా అనేకమంది హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. అయితే వీటన్నింటికంటే మ్యాచ్ ప్రసారంలో బ్రాడ్‌కాస్టర్ చేసిన ఓ చిన్న కెమెరా మూవ్‌మెంట్ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఫిదా చేస్తోంది.
మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలో టెలివిజన్ కెమెరా మొదట ఆర్థర్ ఆషే స్టేడియంలోని షాట్ క్లాక్ వైపు చూపించింది. ఆ క్లాక్‌లో సమయం సరిగ్గా 0:07 సెకన్లు చూపించిన మరుక్షణమే కెమెరామెన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో స్మూత్‌గా కెమెరాను స్టాండ్స్ వైపు పాన్ చేశాడు. అక్కడ ప్రేక్షకులలో హాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రసిద్ధ జేమ్స్ బాండ్ పాత్రధారి పీర్స్ బ్రోస్నన్ కూర్చుని కనిపించారు. 0:07 టైమర్ నుంచి హాలీవుడ్ ఐకానిక్ సీక్రెట్ ఏజెంట్ 007 బాండ్ రూపంలో మెరిసిన పీర్స్ బ్రోస్నన్‌పైకి కెమెరా మారిన తీరు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
టైమింగ్‌ను సరిగ్గా వాడుకుంటూ బ్రాడ్‌కాస్టింగ్ టీమ్ ప్లే చేసిన జీనియస్ మైండ్ ట్రిక్ ఆబ్సల్యూట్ సినిమా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ దిగ్గజ నటుడైన పీర్స్ బ్రోస్నన్ `గోల్డెన్‌ఐ`, `టుమారో నెవర్ డైస్`, `ది వరల్డ్ ఈజ్ నాట్ ఇనఫ్`, `డై అనదర్ డే` వంటి నాలుగు సూపర్ హిట్ జేమ్స్ బాండ్ చిత్రాల్లో 007 ఏజెంట్‌గా నటించి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.
దశాబ్దాలు గడిచినా 007 బాండ్ అనగానే ఇప్పటికీ చాలామందికి ఆయన రూపమే గుర్తొస్తుంది. ఆ ఇమేజ్‌ను లైవ్ కవరేజ్‌లో కెమెరా డైరెక్టర్ చాకచక్యంగా ఉపయోగించుకున్నాడు. ఈ వీడియో క్లిప్‌ను యూఎస్ ఓపెన్ అధికారిక సోషల్ మీడియా ఖాతా కూడా షేర్ చేస్తూ.. `0:07 టైమర్ నుంచి పీర్స్ బ్రోస్నన్ వైపు తిరిగిన కెమెరా ప్లానింగ్.. అద్భుతమైన సినిమాటిక్ క్షణం` అని క్యాప్షన్ జోడించింది. ఈ వీడియో క్షణాల్లో వేల సంఖ్యలో షేర్లు, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది.
సాధారణంగా మ్యాచ్ మధ్యలో సెలబ్రిటీలను చూపించడం సాధారణమే అయినా? ఇలా ప్రతిభతో టైమింగ్‌ను ఉపయోగించి ఐకానిక్ క్యారెక్టర్‌కు కనెక్ట్ చేయడం నిజంగా ప్రసారకర్తల చాకచక్యానికి నిదర్శనం. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిన చిన్న కెమెరా మేజిక్ యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లోనే అతిపెద్ద ఎంటర్‌టైన్మెంట్ హైలైట్‌లలో ఒకటిగా నిలిచింది.