బాలకృష్ణ కోసం దర్శకుడి పూజలు, హోమం..!

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బెంగళూరులోని ప్రముఖ కంబలిపురం ఆలయంలో గోపీచంద్‌ మలినేని ఈ హోమం నిర్వహించారు.

Update: 2026-07-26 06:58 GMT

నందమూరి బాలకృష్ణ ఇటీవల షూటింగ్‌లో గాయ పడ్డ విషయం తెల్సిందే. కాలికి అయిన గాయం కారణంగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు అధికారికంగా హెల్త్‌ బులిటెన్ విడుదల చేసి మరీ ప్రకటించారు. అయినా కూడా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచించిన నేపథ్యంలో అభిమానులు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్స్‌తో పాటు, తన అసెంబ్లీ నియోజకవర్గంకు, అభిమానులకు, ఏపీకి దూరంగా బాలయ్య ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా దర్శకుడు గోపీచంద్‌ మలినేని కారణంగా అంటూ కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణతో రిస్కీ సన్నివేశాలను చేయించిన కారణంగానే ఈ రోజు ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆ ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఉన్నారు.

ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణకు ఆపరేషన్‌...

ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని, అతి త్వరలోనే బాలకృష్ణను ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు డిశ్చార్జ్‌ చేయబోతున్నారు అంటూ అభిమానులకు నందమూరి ఫ్యామిలీ నుంచి సమాచారం అందింది. దాంతో అభిమానులు ఊరిపి పీల్చుకుంటున్నారు. ఇదే సమయంలో అభిమానులు, బాలయ్య శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం త్వరగా బాగుపడాలి అంటూ దేవుళ్లకు ప్రార్థనలు చేస్తున్నారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని బెంగళూరులోని ప్రముఖ దేవాలయంలో హోం నిర్వహించారట. బాలకృష్ణ ఆరోగ్యం త్వరగా మెరుగు పడాలని, తన సినిమా షూటింగ్‌కు పూర్తి ఆరోగ్యంతో, ఫుల్‌ ఎనర్జీతో బాలకృష్ణ హాజరు కావాలంటూ గోపీచంద్‌ మలినేని భారీగా హోమం నిర్వహించినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

గోపీచంద్‌ మలినేని హోమం...

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బెంగళూరులోని ప్రముఖ కంబలిపురం ఆలయంలో గోపీచంద్‌ మలినేని ఈ హోమం నిర్వహించారు. ఈ హోమంలో దాదాపుగా 20 మంది పూజారులు, పదుల కొద్ది బాలకృష్ణ అభిమానులు, గోపీచంద్‌ మలినేని సన్నిహితులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అత్యంత పవర్‌ ఫుల్‌ దేవతగా చెప్పుకునే ఆలయంలో అమ్మవారి సమక్షంలో జరిగిన ఈ హోమం కోసం దర్శకుడు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో దర్శకుడు వరుస విజయాలతో మంచి జోష్‌ మీద ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయన సినిమా షూటింగ్‌లో ఇలా జరగడం విషాదం అంటూ ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా సీన్‌ బాగా రావడం కోసం ఎంతటి కష్టమైన రెడీ అంటారు. అలా చేసిన ప్రయత్నమే ప్రమాదానికి కారణం అయ్యి ఉంటుందని అంటున్నారు.

ఎన్‌బీకే 111 సినిమాతో బాలకృష్ణ...

బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అఖండ 2 తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ, తన తాజా చిత్రం ఎన్‌బీకే 111 తో ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రావాలని భావించాడు. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే 2026 లో బాలయ్య సినిమా ఉండటం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గోపీచంద్‌ మలినేని కాంబోలో గతంలో వచ్చిన వీర సింహారెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మాతలు నిర్మిస్తున్నారు. హిట్‌ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఎన్‌బీకే 111 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాంటి సినిమా ప్రమాదం కారణంగా ఆలస్యం కాబోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ మూడు నాలుగు వారాల్లో పూర్తిగా రికవరీ అయితే 2026 లోనే ఎన్‌బీకే 111 సినిమా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags:    

Similar News