హిందీ తార‌ల బాట‌లో కాక్‌రోచ్ పార్టీకి అడివి శేష్ మ‌ద్ధ‌తు

ఇటీవల సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వైరల్ అయిన ప్రహసన ఉద్యమం `కాక్‌రోచ్ జనతా పార్టీ`(CJP) కు పలువురు ప్రముఖులు, నెటిజన్లు తమ మద్దతును ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-07-26 06:15 GMT

యువ కథానాయకుడు అడవి శేష్ మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ `G2` (గూఢచారి 2) షూటింగ్ ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తదుపరి కీలక షెడ్యూల్ జూలై నుంచి ప్రారంభం కానుండటంతో.. శేష్ తన సోషల్ మీడియా వేదికగా `ద కామ్ బిఫోర్ ద స్టార్మ్` (తుఫానుకు ముందు ప్రశాంతత) అనే క్యాప్షన్‌తో ఒక స్పెషల్ ఫోటోగ్రాఫ్ ను షేర్ చేసారు. 2018లో ఘనవిజయం సాధించిన `గూఢచారి` చిత్రానికి ఇది సీక్వెల్ ..ఏజెంట్ 116 గా అడవి శేష్ రీ-ఎంట్రీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే సినిమా విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై కొందరు అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తూ..అన్నా త్వరగా వచ్చేయ్... నీ సినిమాలు లేక బోరింగ్‌గా ఉంది! అని, మరికొందరు `ఇంకెందుకు లేట్.. 2040లో రిలీజ్ చేయండి`` అని ఫన్నీగా స్పందించారు. ఏదేమైనా `G2` తో అడవి శేష్ బాక్సాఫీస్ వద్ద మరోసారి పెద్ద విజయాన్ని నమోదు చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు శేష్ సామాజిక ఉద్య‌మాల‌లో పాల్గొన‌డం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వైరల్ అయిన ప్రహసన ఉద్యమం `కాక్‌రోచ్ జనతా పార్టీ`(CJP) కు పలువురు ప్రముఖులు, నెటిజన్లు తమ మద్దతును ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిరుద్యోగిత, విద్యావ్యవస్థలోని సమస్యలు, పేపర్ లీకేజీల వంటి అంశాలపై యువత నిరసనను వ్యక్తం చేయడానికి సృష్టించిన ఈ వ్యంగ్య‌ ఉద్యమం దేశవ్యాప్తంగా జెన్ జీ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అడవి శేష్‌తో పాటు పలువురు డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌పై స్పందిస్తూ తమ శైలిలో మద్దతు తెలపడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు- యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై ఒక వినూత్న నిరసనగా మొదలైన ఈ `కాక్‌రోచ్ పార్టీ` ట్రెండ్ డిజిటల్ వేదిక‌ల‌లో విపరీతమైన వ్యూస్, ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సినీ నటులు -ప్రముఖులు ఇలాంటి కాన్సెప్ట్‌లపై స్పందించడం ద్వారా ఈ అంశం మరింత మందికి చేరువైంది. సోషల్ మీడియా స్పందనలు, సరదా కామెంట్లు.. రాజకీయ వ్యంగ్యాత్మక పోస్ట్‌లతో ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రచారం.. నెటిజన్లలో కంటెంట్ సృష్టికి.. విస్తృత చర్చకు ఒక సరికొత్త వేదికగా నిలిచింది.

బాలీవుడ్ లో అడ‌దండ‌లు:

కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) అనే వ్యంగ్యాత్మక డిజిటల్ ప్రచారానికి బాలీవుడ్ అగ్ర నటులైన ఖాన్‌లతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు మద్దతుగా నిలవడం సోషల్ మీడియాలో విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు తమ ప్రత్యేక శైలిలో ఈ క్యాంపెయిన్‌పై స్పందించడం లేదా రీపోస్ట్‌లు చేయడంతో ఈ ఉద్యమానికి ఒక్కసారిగా జాతీయ స్థాయిలో భారీ ప్రచారం లభించింది. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యావ్యవస్థలోని లోపాలు- పేపర్ లీకేజీలపై జెన్ జి నడిపిస్తున్న ఈ డిజిటల్ నిరసనకు సినీ దిగ్గజాలు తోడుకావడంతో.. ఇది కేవలం ఒక సరదా ట్రెండ్‌గానే కాకుండా సమాజంలో ఒక లోతైన చర్చకు దారితీసింది.

వీరితో పాటు బాలీవుడ్‌లోని పలువురు యువ కథానాయకులు, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ ట్రెండ్‌లో భాగస్వాములయ్యారు. తాజాగా అడ‌వి శేష్ కూడా టాలీవుడ్ నుంచి కాక్రోచ్ పార్టీకి మ‌ద్ధ‌తుగా నిలవ‌డం చ‌ర్చ‌గా మారింది. విద్యావ్యవస్థలోని లోపాలు- పేపర్ లీకేజీ ఎపిసోడ్ల‌పై శేష్ నిజాయితీగా స్పందించాడ‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే నెటిజన్లు సృష్టిస్తున్న మీమ్‌లు, వ్యంగ్యాత్మక వీడియోలకు బాలీవుడ్ నటీనటులు రీయాక్ట్ అవ్వడం వల్ల ఈ ప్రచారం మిలియన్ల కొద్దీ వీక్షణలను సొంతం చేసుకుంది. ప్రముఖుల మద్దతు లభించడంతో ఈ `కాక్‌రోచ్ పార్టీ` డిజిటల్ వేదికలపై ఒక ట్రెండింగ్ అంశంగా మారి, ప్రస్తుత సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ప్రతి ఒక్కరి దృష్టి పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది.

Tags:    

Similar News