అఖిల్‌ అసహ్యం మాటలకు దర్శకుడి రియాక్షన్‌ ఎంటో..!

ఇప్పుడు అఖిల్‌ ఏజెంట్‌ సినిమా గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు సురేందర్‌ రెడ్డి యొక్క రియాక్షన్‌ ఏంటా అని అంతా ఆసక్తిగా ఆయన వైపు చూస్తున్నారు.

Update: 2026-07-26 06:30 GMT

ఒక హీరో లేదా హీరోయిన్‌ సినిమా కమిట్ అయిన సమయంలో కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది, ఈ సినిమాతో తమ కెరీర్‌లో ఒక బెస్ట్‌ హిట్‌ పడుతుందని అనుకుంటారు. ఇక దర్శక నిర్మాతలు సైతం అదే విధంగా తమ భవిష్యత్తును ఊహించుకుంటారు. ఏ సినిమా అయినా పాజిటివ్‌ హోప్‌తోనే ప్రారంభిస్తారు, విడుదల సమయంకు కాస్త అనుమానం ఉన్నప్పటికీ కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని నమ్మకం తోనే ప్రచారం చేసి, జనాల్లోకి తీసుకు వెళ్తారు. అయితే విడుదల తర్వాత సినిమా ఫెయిల్‌ అయితే చాలా మంది స్పందించేందుకు నిరాకరిస్తారు. ఆ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు అన్నట్లుగా సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తారు. కానీ కొందరు మాత్రం ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది, ఆ సినిమాలో ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది, ఇలా చేయాల్సింది.. అలా చేయాల్సిందని మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం.

అఖిల్‌ ఏజెంట్‌ సినిమా విషయంలో...

అఖిల్‌ అక్కినేని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా ఏజెంట్‌ సినిమా నిలిచింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని స్వయంగా అఖిల్ సైతం ఒప్పుకున్నాడు. తాజాగా లెనిన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్‌ తన గత చిత్రాల గురించి మాట్లాడుతూ ఏజెంట్‌ పై షాకింగ్‌ కామెంట్స్ చేశాడు. ఏజెంట్‌ సినిమాలో తన లుక్‌ను చూసుకున్న సమయంలో తనకే అసహ్యంగా అనిపించిందని అన్నాడు. ప్రతి సన్నివేశంలోని తన యాక్టింగ్‌ పై తానే విమర్శలు చేసుకున్నాడు. అయితే ఇదంతా కూడా దర్శకుడి పనితనం అనే అభిప్రాయం ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. సినిమా విజయం, పరాజయం లో ముఖ్యంగా దర్శకుడి పాత్ర ఎక్కువగా ఉంటుంది. హీరో, హీరోయిన్‌ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పాత్ర కూడా ఉంటుంది, కానీ దర్శకుడి పాత్ర మెజార్టీ అనడంలో సందేహం లేదు.

దర్శకుడు సురేందర్ రెడ్డి...

ఇప్పుడు అఖిల్‌ ఏజెంట్‌ సినిమా గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు సురేందర్‌ రెడ్డి యొక్క రియాక్షన్‌ ఏంటా అని అంతా ఆసక్తిగా ఆయన వైపు చూస్తున్నారు. అఖిల్‌ లుక్‌ విషయంలో తుది నిర్ణయం కచ్చితంగా దర్శకుడిదే అయ్యి ఉంటుంది, అంతే కాకుండా అఖిల్‌తో యాక్టింగ్‌ చేయించింది కూడా దర్శకుడే కనుక మొత్తం బాధ్యత ఆయన తీసుకోవాల్సిందే కదా అనే అభిప్రాయంను అక్కినేని ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌ తన లుక్‌ విషయంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అఖిల్‌ను కొందరు విమర్శిస్తున్నారు. ఆ సమయంలో కనీసం మానిటర్‌లో చూసుకున్న సమయంలో అయినా లుక్ విషయమై తేడాగా అనిపించలేదా అంటూ కొందరు అఖిల్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అఖిల్‌ ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా దర్శకుడిని అవమానించినట్లు అవుతుందని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అఖిల్‌ లెనిన్‌ మూవీ హిట్‌..

మొత్తానికి అఖిల్‌ ఏజెంట్‌ బాధ నుంచి బయట పడ్డట్లుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ సినిమా కారణంగా దాదాపు మూడు ఏళ్లు అఖిల్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. చాలా ఎక్కువ గ్యాప్‌ తీసుకుని మంచి స్క్రిప్ట్‌తో 'లెనిన్‌' ను చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్‌ కొట్టాడు. అఖిల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా, ఫస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా లెనిన్‌ నిలవడంతో ఇప్పుడు అంతా ఆయన తదపరి సినిమా విషయమై ఆసక్తిగా చూస్తున్నారు. ఈమధ్య కాలంలో అఖిల్‌ కోసం చాలా మంది యంగ్‌ హీరోలు కథలు రెడీ చేశారు. ముఖ్యంగా ఒక బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు ఆ మధ్య అఖిల్‌ను కలిసి కథ చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. నాగార్జున ఆ మధ్య కొన్ని కథలను అఖిల్‌ కోసం రెడీ చేయించాడని, అంతే కాకుండా అక్కినేని మల్టీస్టారర్‌ సినిమాలకు సంబంధించిన చర్చలు సైతం జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అఖిల్‌ వచ్చే ఏడాదిలో తన కొత్త సినిమా విడుదల ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News