కత్తుల్లాంటి కళ్ళతో కైపెక్కిస్తున్న దంగల్ బ్యూటీ!
అలాంటి ఈమె ఇప్పుడు తాజాగా బాక్సింగ్ చేస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిచ్చి.. తన అందాలతో మరోసారి మెస్మరైజ్ చేసింది.;
దంగల్.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కీలక పాత్రలో 2016లో కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగట్, అతని కుమార్తెల జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రానికి నితిన్ తివారీ దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ రాయ్ కపూర్ , అమీర్ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో గీత ఫోగట్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి తన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఫాతిమా సనా షేక్. ఒక్క సినిమా ఆమె అదృష్టాన్ని పూర్తిగా మార్చేసింది అని చెప్పాలి. 2016లో వచ్చిన ఈ సినిమా సుమారుగా 2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఈ సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటివరకు ఈ సినిమా రికార్డును ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం. నిజానికి సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 దాదాపు అంచుల వరకు వెళ్లి.. 1800 కోట్లతో సరిపెట్టుకుంది. దీంతో ఆ చిత్రం కూడా ఈ సినిమా రికార్డును చెరపలేకపోయింది. అలా ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న ఫాతిమా సనా సేక్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో పలు అంశాలపై చర్చిస్తూ విమర్శలు కూడా ఎదుర్కొంది.
ఇక అలాంటి ఈమె ఇప్పుడు కొన్ని చిత్రాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యింది.అందులో భాగంగానే ఒకసారి చీర కట్టుకొని సాంప్రదాయంగా కనిపించే ఫాతిమా.. మరొకవైపు గ్లామర్ వలకబోస్తూ చిట్టిపొట్టి బట్టల్లో అభిమానులను తన అందాలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె ఇప్పుడు తాజాగా బాక్సింగ్ చేస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిచ్చి.. తన అందాలతో మరోసారి మెస్మరైజ్ చేసింది. మినీ డ్రెస్ తో అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ.
పైగా ఈ ఫోటోలను షేర్ చేస్తూనే.. పైగా ఆ ఫోటోలకు క్యాప్షన్ గా.. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీ చెప్పిన ఒక కొటేషన్ ని పంచుకుంది. "సీతాకోక చిలుకలా ఎగరాలి.. తేనెటీగలా కుట్టాలి" అంటూ ఒక క్యాప్షన్ పంచుకుంది. ప్రస్తుతం ఫాతిమా సనా షేక్ షేర్ చేసిన ఈ ఫోటోలు.. ఇచ్చిన కొటేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఒక్క బాక్సింగ్ లోనే కాదు నిజ జీవితంలో కూడా ఇలా ఉంటేనే మనం మన జీవితంలో సక్సెస్ అవ్వగలము అని నిరూపిస్తూ షేర్ చేసిన ఈ కొటేషన్ అటు అభిమానులను కూడా ఆలోచింపచేస్తోందనే చెప్పాలి.
అలాగే తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి
గుస్తాఖ్ ఇష్క్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఆర్ మాధవన్ తో కలిసి వివేక్ సోనీ దర్శకత్వంలో ఆప్ జైసా కోయి నహి చిత్రంలో కూడా నటించింది.. ధర్మా ప్రొడక్షన్లో మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు ఇలా అభిమానులను తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది