సీతాపయనం ప్రీరిలీజ్: హృదయాల్ని టచ్ చేసిన ట్యాంక్ బండ్ శివ
ఇది స్ఫూర్తిని నింపే స్పీచ్. శ్రీరామ ఫిల్మ్స్ `సీత పయనం` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిజమైన రియల్ హీరోలను గౌరవించడం అభినందనీయం.;
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన `సీతా పయనం` ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నిరంజన్ - ఐశ్వర్య నాయకానాయికలు. శ్రీరామ ఫిలింస్ నిర్మించింది. సీతా పయనం` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అర్జున్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా కేవలం గ్లామర్‌కే ప్రాధాన్యత ఇవ్వకుండా, సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రకాష్ ఆమ్టే, దుశ్చర్ల సత్యనారాయణ, ట్యాంక్ బండ్ శివ వంటి రియల్ హీరోలను ఆహ్వానించి వారిని సన్మానించారు.
ఈ వేదికపై ట్యాంక్ బండ్ శివ ఎమోషనల్ స్పీచ్ ఆద్యంతం హృదయాలను గెలుచుకుంది. అతడు అర్జున్, బ్రహ్మానందంలపై తన అభిమానాన్ని కనబరిచిన తీరు, వారిని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన విషయాలను వర్ణించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ట్యాంక్ బండ్ శివ మాట్లాడుతూ...అనాధగా పెరిగి పెద్దయ్యాను. యాదగిరీ టాకీస్ లో `అహనా పెళ్లంట` సినిమా చూసినప్పుడు బ్రహ్మానందం గారిని చూసాను.. మన్నెంలో మొనగాడు సినిమాలో అర్జున్ గారిని చూసాను.. ఆయన హీరోయిన్ ని కాపాడుతారు అందులో. ఒకే ఒక్కడు, జెంటిల్ మేన్ ఎన్నో గొప్ప సినిమాల్లో అర్జున్ నటించారు. అర్జున్, బ్రహ్మానందం వంటి వారి నుంచి స్ఫూర్తిని పొందుతాను`` అని తెలిపారు.
రోడ్డుపైన ఉన్న శవాల శివకు అన్నీ తానే అయింది నా భార్య శాంత అని తన ప్రయాణం గురించి శివ ఈ వేదికపై వర్ణించారు. ఈ ఈవెంట్లో భార్యా భర్తల గొప్పతనాన్ని ట్యాంక్ బండ్ శివ ఎంతో అందంగా ఆదర్శవంతంగా ఆవిష్కరించారు... ట్యాంక్ బండ్ లో చువ్వలు ఏరుకుని బతికే నాకోసం రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఆమె తన కుటుంబాన్ని వదులుకుని నా కోసం వచ్చింది.. సర్వం తానే.. నా జాన నా వెంటే ఉంది..! అంటూ శివ ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు.
ఇది స్ఫూర్తిని నింపే స్పీచ్. శ్రీరామ ఫిల్మ్స్ `సీత పయనం` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిజమైన రియల్ హీరోలను గౌరవించడం అభినందనీయం.
శ్రీరామ ఫిల్మ్స్ సన్మానించిన రియల్ హీరోలు:
70 ఎకరాల** వ్యవసాయ భూమిని ఒక గొప్ప అడవిగా మార్చారు దుశ్చర్ల సత్యనారాయణ. ఆ అడవిలో పండే ఏ పండును ఆయన కోయరు. వాటన్నింటినీ కేవలం పక్షులు, మూగజీవాలకే అంకితం చేశారు. పర్యావరణం పట్ల ఆయనకున్న అంకితభావానికి ప్రభుత్వం నుండి ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నారు.
డాక్టర్ ప్రకాష్ ఆమ్టే - డాక్టర్ మందాకిని ఆమ్టే దంపతులు రియల్ హీరోలుగా ఈ వేదికపై సన్మానం అందుకున్నారు. వీరు మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో గిరిజనుల కోసం దశాబ్దాలుగా వైద్య మరియు విద్యా సేవలు అందిస్తున్నారు. బాబా ఆమ్టే వారసత్వాన్ని కొనసాగిస్తూ, సమాజానికి దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో వీరు చేస్తున్న కృషి అసమానమైనది. వీరిని రియల్ హీరోలుగా గుర్తించి శ్రీరామ ఫిల్మ్స్ ఘనంగా సన్మానించింది.
ఈ రియల్ హీరోలు చేస్తున్న సామాజిక సేవలకు మద్దతుగా శ్రీరామ ఫిల్మ్స్ సంస్థ ఒక్కొక్కరికి, లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించింది. ఇది ఇతర సినిమాల ప్రీ-రిలీజ్ వేడుకలలా కాకుండా, సమాజానికి మేలు చేస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తూ వేడుకను నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. శ్రీరామ ఫిల్మ్స్ స్ఫూర్తితో భజంత్రీ కార్యక్రమాలను ప్లాన్ చేసే చాలా మంది నిర్మాతలు మారాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.