జోరు పెంచిన నవీన్ పోలిశెట్టి.. ఏకంగా కోలీవుడ్ డైరెక్టర్ తో కొత్త మూవీ!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచారు. ముఖ్యంగా అటు స్టార్ డైరెక్టర్లతో అవకాశాలు కుదుర్చుకుంటూనే.. ఇటు కొత్త నిర్మాణ సంస్థలతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోయారు. ఇక రెండు రోజుల క్రితమే టాలీవుడ్ బడా దర్శకులు , నిర్మాతలతో కలసి గెట్ టుగెదర్ లో సందడి చేసిన ఈయన తాజాగా పక్క ఇండస్ట్రీపై దృష్టి మరల్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అసలు విషయంలోకి వెళ్తే .. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ పార్టీలో ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ దర్శకులు ఒకే చోట చేరి సందడి చేశారు. ఇక వీరందరిని ఒకే చోట నిలబెట్టి నా లైఫ్ లోనే అత్యంత కాస్ట్లీ యెస్ట్ ఫ్రేమ్ ఇదే . మొత్తం రూ.5,500 కోట్ల ఫ్రేమ్ అంటూ నవీన్ తనదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు అదే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తన కొత్త ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు నవీన్ పోలిశెట్టి.
గత కొన్ని రోజులుగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి ఒక సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా.. తాజాగా ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ డైరెక్టర్ ఆంటోనీ భాగ్యరాజు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి తన కొత్త సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే అటు గెట్ టుగెదర్ పార్టీ ఈయనకు బాగా కలిసొచ్చింది అనే కామెంట్లు ఆడియన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి.. మరి ఈ కోలీవుడ్ డైరెక్టర్ తో నవీన్ పోలిశెట్టి ఎలాంటి సబ్జెక్టుతో మన ముందుకు రాబోతున్నారు అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనుంది.
నవీన్ పోలిశెట్టి కెరియర్ విషయానికి వస్తే.. కామెడీ హీరోగా గా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. నటుడిగా, స్క్రీన్ రైటర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే చిత్రంతో అరంగేట్రం చేసిన నవీన్ .. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేస్తున్నారు.. ఇకపోతే 2023లో విడుదలైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో అనుష్క శెట్టితో కలిసి స్టాండప్ కమెడియన్ గా నటించి మెప్పించారు. కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ 2025లో అనగనగా ఒక రాజు చిత్రంలో మీనాక్షి చౌదరి సరసన నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.