ఈడీ ముందు హాజరైన నిధి అగర్వాల్!

కేసు తీవ్రత దృష్ట్యా? మీడియా నుండి తప్పించుకోవడానికి నిధి అగర్వాల్ తన ముఖానికి మాస్క్ ధరించి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Update: 2026-08-19 16:08 GMT

యువ నటి నిధి అగర్వాల్‌కు సంబంధించి తాజాగా ఓ సంచల‌న వార్త బయటకు వచ్చింది. అక్రమ బెట్టింగ్ యాప్ కేసులకు సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా అమ్మ‌డు హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యారు. కొద్ది రోజులుగా సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంపై ఇప్పుడు అధికారికంగా విచారణ ప్రారంభం కావడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది. ఈ కేసులో నిధి అగ‌ర్వాల్ పాత్రపై స్పష్టత కోసం అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.

కేసు తీవ్రత దృష్ట్యా? మీడియా నుండి తప్పించుకోవడానికి నిధి అగర్వాల్ తన ముఖానికి మాస్క్ ధరించి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియా కెమెరాల హడావిడి ఉన్నా? ఎవరికీ ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా జాగ్ర త్తగా కార్యాలయంలోకి వెళ్లారు. విచారణ పూర్తయిన అనంతరం కూడా ఆమె మీడియా ప్రశ్నలకు స్పందించ కుండానే బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలు ఈ కేసులోకి నటి ఎలా వచ్చిందనేది ప్రధాన చర్చగా మారింది. సదరు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లు .. వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్ల నిధి అగ‌ర్వాల్ కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. సాధారణంగా సినీ తారలు వివిధ రకాల యాప్‌లు, బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తుంటారు. అయితే ఆ ప్రమోట్ చేసే కంపెనీల వెనుక ఉన్న అక్రమ వ్యవహారాలు, ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న బెట్టింగ్ యాప్స్‌తో సంబంధం ఉన్నప్పుడు విచారణ ఎదుర్కోవడం సర్వసాధారణం.

గత కొంతకాలంగా ఈడీ అధికారులు ఇలాంటి అక్రమ బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచారు. వీటి ద్వారా వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతున్నాయని మనీ లాండరింగ్ జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సంస్థలతో భాగస్వామ్యం ఉన్న సెలబ్రిటీలందరినీ వరుసగా పిలిచి విచారిస్తున్నారు. ఇదే కోణంలో నిధి అగర్వాల్‌కు కూడా నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఈ విచారణ ద్వారా యాప్ నిర్వాహకులు, నిధి అగ‌ర్వాల్ మధ్య ఆర్థిక లావాదేవీల గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

పరిశ్రమలో ఉన్న తారలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నప్పుడు ఆ కంపెనీల నేపథ్యం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో? ఈ కేసు మరోసారి గుర్తుచేస్తోంది. భారీ పారితోషికం వస్తుందనే కారణంతో కంపె నీల పూర్వాపరాలను పరిశీలించకుండా ప్రమోషన్స్ చేయడం వల్ల తారలు ఇలాంటి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఈ కేసులో నిధి అగర్వాల్ విచారణ కోసం హాజరయ్యారా? లేదా? ఆమెపై నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నాయా అనేది విచారణ ముగిశాక కానీ స్పష్టత రాదు.

అయితే ఈ ఘటన టాలీవుడ్ తారల్లో ఒక్క‌సారిగా కలకలం సృష్టించింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా కంటెంట్‌తో బిజీగా ఉండే నటీనటులు ఇప్పుడు ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావడం సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈడీ విచారణ తర్వాత నిధి అగర్వాల్ ఏవైనా వివరణ ఇస్తారా? లేదా? అనేది చూడాలి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News