అక్కినేని హీరో వెరైటీ టైమింగ్.. భలే సెట్టయ్యింది
చేతిలో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటేనో, లేక ముగ్గురూ కలిసి సినిమా అనౌన్స్ చేసే ప్లాన్ ఉంటేనో ఇలాంటి ఫోటోషూట్స్ చూస్తుంటాం.
నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురూ కలిసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ 'వెరైటీ ఇండియా' కవర్ పేజీపై కనిపించడం ఫ్యాన్స్ కి మంచి కిక్ అయితే ఇచ్చింది. చేతిలో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటేనో, లేక ముగ్గురూ కలిసి సినిమా అనౌన్స్ చేసే ప్లాన్ ఉంటేనో ఇలాంటి ఫోటోషూట్స్ చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండానే వీళ్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. దీని వెనుక ఎలాంటి సినిమా ప్రమోషన్ లేకపోయినా, ఈ ఫోటోషూట్ టైమింగ్ భలే సెట్ అయింది.
ముగ్గురు హీరోల కెరీర్లు ఇప్పుడు సాలిడ్ ఫేజ్‌లో ఉన్నాయి. చైతూ ఇప్పుడు మంచి ట్రాక్ లో ఉన్నాడు. తండేల్ సినిమా అతనికి బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్క్ చూపించింది. ఆ వెంటనే వృషకర్మ లాంటి భారీ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. తన 25వ సినిమా కూడా లైనప్‌లో ఉంది. అటు ఓటీటీలో దూత వెబ్ సిరీస్ తోనూ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.
అఖిల్ ట్రాక్ రికార్డ్ కూడా లెనిన్ తో గాడిలో పడింది. ఏజెంట్ తర్వాత గ్యాప్ వచ్చినా, ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడి లెనిన్ తో మంచి కమర్షియల్ రిజల్ట్ అందుకున్నాడు. కొడుకులిద్దరూ కెరీర్ పరంగా స్ట్రాంగ్ జోన్ లోకి వస్తుంటే, నాగార్జున తన 100వ సినిమాకు దగ్గరవుతున్నాడు. ఇలా ముగ్గురికీ చెప్పుకోవడానికి సాలిడ్ పాయింట్స్ ఉన్న సమయంలో ఈ కవర్ పేజీ రావడం ప్లస్ అయింది.
ఈ ఏడాదే ఇండియాలో అడుగుపెట్టిన వెరైటీ మ్యాగజైన్, తమ తొలి కవర్ కోసం నలుగురు బాలీవుడ్ స్టార్స్ ను ఎంచుకుంది. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి ఉన్న 90 ఏళ్ల సినిమా ప్రయాణాన్ని హైలైట్ చేస్తూ ఈ కవర్ ను డిజైన్ చేసింది. దీంట్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్రాండ్ కూడా హైలెట్ గా మారింది. ఎప్పటినుంచో నాగార్జున స్టూడియో వ్యవహారాలు చూసుకుంటుండగా, చైతూ పోస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ వైపు ఆసక్తి చూపిస్తున్నాడు.భవిష్యత్తులో ప్రొడక్షన్ లోకి వస్తానని అఖిల్ కూడా గతంలో చెప్పాడు.
ఈ కవర్ పేజీ లుక్ విషయానికి వస్తే బ్రౌన్ కలర్ థీమ్ లో ముగ్గురినీ ప్రెజెంట్ చేసిన విధానం చాలా క్లాసీగా ఉంది. నాగార్జున ఫిట్ నెస్ చూస్తే ఇద్దరు కొడుకులతో పాటు అన్నదమ్ముడిలా ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉన్న ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు ఇలా ఒకే ఇంటర్నేషనల్ బ్రాండ్ కవర్ పై మెరవడం తరచుగా జరిగే విషయం కాదు. ఫ్యామిలీ బ్రాండ్ నేషనల్ లెవెల్ లో హైలెట్ అయ్యేలా అక్కినేని హీరోలు ఇచ్చిన స్టిల్స్ మామూలుగా లేవు. ముగ్గురూ కెరీర్లలో పాజిటివ్ ఫేజ్ లో ఉన్న టైమ్ లో వచ్చిన ఈ ఫ్రేమ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.