అనిల్ రావిపూడి - వెంకటేష్ - కళ్యాణ్ రామ్ మూవీ టైటిల్ లాక్!
అయితే ఇప్పుడు సడన్గా ఈ సినిమా టైటిల్ తో పాటు విడుదల తేదీని రిలీజ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు అనిల్ రావిపూడి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓటమెరుగని దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. ప్రతి ఏడాది సంక్రాంతిని టార్గెట్గా చేసుకొని సినిమాలు విడుదల చేస్తున్నారు.. అందులో భాగంగానే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖ స్టార్ సీనియర్ హీరో వెంకటేష్, మరో హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అనిల్ రావిపూడి కొత్త మూవీ టైటిల్ విడుదల..
అయితే ఇప్పుడు సడన్గా ఈ సినిమా టైటిల్ తో పాటు విడుదల తేదీని రిలీజ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు అనిల్ రావిపూడి. సినిమా నుండి ఎటువంటి గ్లింప్స్ విడుదల చేయకుండా హీరోలు, హీరోయిన్లతో కలిసి ఒక వీడియో రిలీజ్ చేస్తూ సినిమా టైటిల్ ను రివీల్ చేసి టైటిల్ విషయంలో సరికొత్త స్ట్రాటజీ ఉపయోగించారు అనిల్ రావిపూడి.. తాజాగా ఈ సినిమాలో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లు మల్టీ స్టారర్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నలుగురితో కలిసి ఒక వీడియో విడుదల చేశారు అనిల్ రావిపూడి.
'జనవరి 12న విడుదల.. బావ బామ్మర్ది' సౌజన్యంతో..
హీరోలు , హీరోయిన్లు ఇద్దరూ అనిల్ రావిపూడి తో మాట్లాడుతూ.. అనిల్ ఈ సినిమా టైటిల్ ఏంటి ? అని అడగగా 'జనవరి 12న విడుదల' అంటూ తెలిపారు. మేము అడుగుతున్నది రిలీజ్ డేట్ కాదు సినిమా టైటిల్ ఏంటి అనడం జనవరి 12న విడుదల అంటూ మళ్ళీ చెప్పడం .. మొత్తానికైతే అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సినిమా టైటిల్ జనవరి 12న విడుదల అంటూ స్పష్టం చేశారు. ఇక సినిమా టైటిల్ ఇదే అంటూ అలాగే అదే జనవరి 12వ తేదీన సినిమా విడుదల చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. మొత్తానికైతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ చిత్రానికి జనవరి 12న విడుదల అనే టైటిల్ తో "బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జనవరి 12న విడుదల మూవీ విశేషాలు..
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న జనవరి 12న విడుదల చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి, వెంకటేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి , సురేష్ ప్రొడక్షన్స్, జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది జనవరి 12న రాబోతున్న ఈ చిత్రం ఖచ్చితంగా మరో ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.