'ఇరుముడి' బజ్ ఎలా ఉందంటే..

రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇరుముడి' బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునేలా కనిపిస్తోంది.

Update: 2026-08-19 11:13 GMT

రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇరుముడి' బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునేలా కనిపిస్తోంది. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ ఇప్పటికే 1.5 లక్షల డాలర్లు దాటడం చూస్తుంటే ఆడియెన్స్ లో ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రెగ్యులర్ కమర్షియల్ మాస్ కథలకు భిన్నంగా రవితేజ ఈసారి ఒక కొత్త జోన్ ట్రై చేశాడు. దర్శకుడు శివ నిర్వాణ ఫ్యామిలీ ఎమోషన్స్ కు కాస్త థ్రిల్లర్ టచ్ ఇస్తూనే అయ్యప్ప దీక్షను కూడా కథలో ఒక కీలక ఎమోషన్ గా డిజైన్ చేశాడు. ఇలాంటి ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ పెరిగింది. రవితేజ కూడా ఈ ప్రాజెక్ట్ తనకు చాలా స్పెషల్ అని చెప్పడంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది.

ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. వరుసగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీనికి తోడు 'మల్లెపూల పల్లకి' పాట చార్ట్ బస్టర్ గా నిలవడంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచడం బజ్ క్రియేట్ చేయడానికి బాగా ఉపయోగపడింది.

యూఎస్ మార్కెట్ తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. నైజాం ఏరియాలో ఆన్లైన్ టికెట్ సేల్స్ ఓపెన్ చేసిన గంటలోపే ఫాస్ట్ ఫిల్లింగ్ బోర్డులు పడిపోయాయి. దీన్ని బట్టి గ్రౌండ్ లెవెల్ లో సినిమాకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయితే టోటల్ ప్రీ సేల్స్ లెక్క భారీగా మారే అవకాశం ఉంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఇరుముడి మీద పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. సెన్సార్ టాక్ చాలా బాగుందని ప్రచారం జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సైతం సినిమా అవుట్ పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కూడా శివ నిర్వాణ అనుకున్న కథను పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకురావడానికి సపోర్ట్ చేశాయని టీమ్ నమ్మకంగా చెబుతోంది.

రవితేజ సినిమాకు రిలీజ్ కు ముందే ఈ స్థాయిలో పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి స్టార్ట్ అయితే దొరికింది. ఆగస్టు 21న థియేటర్లలో కూడా ఇదే రేంజ్ లో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రవితేజ కెరీర్ లో ఇరుముడి ఒక సాలిడ్ హిట్ గా నిలిచిపోవడం ఖాయం. ఇక ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News