సిల్వర్ స్క్రీన్‌పై ఆషికా రంగనాథ్ దశాబ్ద కాలం.. గ్లామరస్ పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్ జర్నీ కళ్యాణ్ రామ్ సరసన 'అమిగోస్' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన ఆషికా, ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
కన్నడ కస్తూరి, టాలీవుడ్ చందమామ ఆషికా రంగనాథ్ సినీ పరిశ్రమలో విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2016లో 'క్రేజీ బాయ్' సినిమాతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ క్యూట్ బ్యూటీ, తన అందం, అభినయంతో స్వల్ప కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకున్న ప్రత్యేక ఫోటోలు, భావోద్వేగపూరిత పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐవరీ డ్రెస్‌లో మైమరిపించే గ్లామర్:
ఈ శుభసమయంలో ఆషికా పంచుకున్న లేటెస్ట్ ఫొటోషూట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐవరీ లేస్ ట్రిమ్డ్ క్రాప్ టాప్, మ్యాచింగ్ క్రీమ్ కలర్ హై-వేస్టెడ్ మ్యాక్సీ స్కర్ట్ ధరించి ఎంతో గ్లామరస్‌గా కనిపించారు. ఇక 30 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల భామలా కనిపిస్తూ, తన చిరునవ్వులతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు.
ఇప్పటికే పదేళ్లు పూర్తయిందా?..
ఆషికా ఎమోషనల్ పోస్ట్ తెరపై తన పదేళ్ల ప్రయాణంపై స్పందిస్తూ ఆషికా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "అప్పుడే పదేళ్లు గడిచిపోయాయా? ఇప్పటికీ నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినట్లే కనిపిస్తానని అందరూ చెబుతుంటారు.. ఆ మాటను నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఇక అయితే నేర్చుకోవాలనే తపన, పెరగాలనే కోరిక మాత్రం రోజురోజుకూ మరింత పెరుగుతోంది" అంటూ రాసుకొచ్చారు.
'అమిగోస్' నుంచి 'నా సామిరంగ' వరకు:
టాలీవుడ్ జర్నీ కళ్యాణ్ రామ్ సరసన 'అమిగోస్' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన ఆషికా, ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత నాగార్జున సరసన 'నా సామిరంగ' సినిమాలో నటిగా మెప్పించారు. ఇక తాజాగా సంక్రాంతికి వచ్చిన 'భర్త మహాశయులకు' చిత్రంతో మంచి సక్సెస్ అందుకొని, టాలీవుడ్‌లో వరస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు.
సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్:
గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో మంచి బిజీ హీరోయిన్‌గా మారారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, నిత్యం తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటారు.
సినీ ప్రయాణంలో దశాబ్దం పూర్తి చేసుకున్న ఆషికా రంగనాథ్, రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తూ పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.