సౌత్ లో నటి కెరీర్ ఊహించని విధంగా!
మృణాల్ ఠాకూర్ అలియాస్ సీతమ్మ సినీ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. సీరియల్స్ తో మొదలైన అమ్మడి జర్నీ హీరోయిన్ గా దిగ్విజయంగా కొనసాగుతోంది.;
మృణాల్ ఠాకూర్ అలియాస్ సీతమ్మ సినీ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. సీరియల్స్ తో మొదలైన అమ్మడి జర్నీ హీరోయిన్ గా దిగ్విజయంగా కొనసాగుతోంది. మరాఠీ నుంచి బాలీవుడ్ ని దాటుకుని టాలీవుడ్ వరకూ తిరుగులేని ప్రయాణం ఆమె సొంతం. మారాఠీలో `హలో నందన్`, బాలీవుడ్ లో `లవ్ సోనియా` తో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో అనతి కాలంలో బిజీ హీరోయిన్ గా మారింది. `సూపర్ 30`, `బట్లా హౌస్`, `ఘోస్ట్ స్టోరీస్` లాంటి చిత్రాలు అమ్మడికి హిందీలో సరైన పౌండేషన్ వేయడంతో సక్సెస్ పుల్ గా కొనసాగుతోంది.
టాలీవుడ్ లో `జెర్సీ`,` సీతారామం` లాంటి విజయాలు అమ్మడికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ చిత్రాల సక్సెస్ తోనే తాను బిజీ కాలేదు. అంతకు మించి గొప్ప పెర్పార్మర్ కావడంతోనే అన్నది కాదనలేని నిజం. పాత్రల విషయంలో ఎంతో సెలక్టివ్ గా ఉంటుంది. తాను ఎంపిక చేసుకునే పాత్రల్లోనే గ్లామర్ అప్పిరియన్స్ ఉండేలా చూసుకుంది. ఈ విషయంలో మృణాల్ ఎంతో తెలివైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం బాలీవు డ్..టాలీవుడ్ అంటూ రెండు భాషల్ని దున్నేస్తుంది. పారితోషికం పరంగా భారీగానే అందుకుంటుంది.
దర్శక, రచయితలు మృణాల్ ని దృష్టిలో పెట్టుకునే పాత్రలు రాస్తున్నారంటే? నటనలో తానేస్థాయికి చేరిందన్నది అంచనా వేయోచ్చు. అయితే తెలుగులో అమ్మడి జర్నీ మాత్రం ఇంత గొప్పగా సాగుతుందని తాను కూడా ఊహించలేదంది. నటిగా తన ప్రయాణమంతా హిందీ చిత్ర పరిశ్రమలో అనుకునే జర్నీ మొదలు పెట్టినట్లు తెలిపింది. సీరియల్స్ లో నటించడం ప్రారంభించినా తర్వాత నటిగా ఏ హైట్స్ కు చేరుకోవాలన్నా? బాలీవుడ్ తప్ప మరో పరిశ్రమ ఆలోచన లేకుండానే చాలా కాలం కొనసాగినట్లు గుర్తు చేసుకుంది.
తెలుగు లో సక్సస్ అనంతరం ఇక్కడి అభిమానులు చూపించిన ప్రేమకు తానెంతో ఫిదా అయ్యానంది. వాళ్లకెప్పుడు తాను రుణపడే ఉంటానంది. ఇక్కడింత గొప్ప ప్రయాణం ఉంటుందని ఏనాడు భావించ లేదని..సినిమాలు చేయడం ప్రారంభిం చిన తర్వాత ఇక్కడ నటులకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? గౌరవ, మర్యాద లుంటాయన్నది అర్దమైంది అంది. ఈ బ్యూటీ ఇంకా కోలీవుడ్ లో అడుగు పెట్ట లేదు. కేవలం టాలీవుడ్ అభిమానంతోనే ఇంతగా మురిసిపోతుందంటే? అరవ అభిమానులు ప్రేమ కురిపిస్తే ఎలా ఉంటుందో? అక్కడా సక్సెస్ అయిన తర్వాత అర్దమవుతుంది. అలాగే పాన్ ఇండియాలో వెలిగిపోతున్న కన్నడ, మలయాళ పరిశ్రమ లోనూ అంతే గౌరవం, గుర్తింపు దక్కుతాయి.