తలైవర్-లోకనాయకుడి మల్టీస్టారర్ నేపథ్యం ఇదేనా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ డ్రామా `జైలర్ 2`. 20203లో విడుదలై బక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన `జైలర్` మూవీకిది సీక్వెల్.;
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ డ్రామా `జైలర్ 2`. 20203లో విడుదలై బక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన `జైలర్` మూవీకిది సీక్వెల్. రజనీ సినిమాల్లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ఈ సినిమా ఆయన అభిమానుల్ని, సినీ లవర్స్‌ని విశేషంగా అలరించి బాక్సాఫీస్ వద్ద మేకర్స్‌కు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో రజనీ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు వరుస ఫ్లాపులు, డిజాస్టర్లలో ఉన్న రజనీ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు.
రీసెంట్‌గా `కూలీ`తో మరో ఫ్లాప్‌ని ఎదుర్కోవడంతో ఇప్పుడు అందరి దృష్టి `జైలర్` సీక్వెల్ పై పడింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ రివేంజ్ డ్రామా ఈ ఏడాది జూన్ 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిథున్ చక్రవర్తి, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, వినాయకన్‌లతో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కనిపించనున్నాడు. తనది కీలకమైన గెస్ట్ రోల్. దీంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఎప్పుడెప్పుడు ఇది ప్రేక్షకుల ముందుకొస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనితో పాటు కమల్ నిర్మిస్తున్న మూవీలోనూ రజనీ నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన వర్క్ ఇటీవలే మొదలైంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌లతో పాటు రజనీ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. `జైలర్ 2` మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు.
ఇందులో రజనీతో పాటు కమల్ హాసన్ కూడా నటిస్తుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 46 ఏళ్ల క్రితం ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటించారు. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత నెల్సన్ డైరెక్షన్‌లో భారీ మల్టీస్టారర్‌కు శ్రీకారం చుడుతున్నారు. సైమా అవార్డు వేడుకలో కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించడం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. కానీ కుదరలేదు. త్వరలోనే మీ ముందుకు కలిసి రానున్నాం. అది మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుందని ప్రకటించారు.
అన్నట్టుగానే ఆ సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. ఈ మూవీని 80వ దశకం నేపథ్యంలో నెల్సన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాలో ఇద్దరు స్టార్స్ 80వ దశకంలో ఎలా ఉండేవారో అదే తరహాలో ఇందులో కనిసిస్తారని ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన ప్రోమోని దర్శకుడు నెల్సన్ షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. చెన్నైలోని ప్రసాద్స్ స్టూడియోస్‌లో దీనికి సంబంధించిన షూటింగ్‌ని చేశారట. దీన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ షూట్ చేసినట్టుగా తెలిసింది. త్వరలోనే దీన్ని రిలీజ్ చేస్తూ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించనున్నారని ఇన్ సైడ్ టాక్.