బాలయ్య, వంశీతో మూవీ.. పవన్ డైరెక్టర్ ప్లాన్ ఏంటి?
టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లకు ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుందని చెప్పాలి. అలాంటి మరొక కాంబో ఇప్పుడు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.;
టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లకు ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుందని చెప్పాలి. అలాంటి మరొక కాంబో ఇప్పుడు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత నాగవంశీ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో మూవీ దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రానుందని వినికిడి
అయితే చాలా కాలంగా బాలయ్యతో సినిమా చేయాలన్న ప్రయత్నంలో ఉన్న హరీష్ శంకర్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ దొరికిందన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో హరీష్ శంకర్ టాలెంట్ తెలిసిందే. గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో తన మార్క్ చూపించారు. ముఖ్యంగా స్టార్ హీరోలను మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గర చేయడం ఆయన స్పెషాలిటీ.
ఇప్పుడు బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడని సమాచారం. నాగవంశీ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే హరీష్ శంకర్ ప్రస్తుతం ఫామ్ లో లేరనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇటీవల రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ కలిగించింది.
డిజాస్టర్ గా నిలిచిన ఆ సినిమా తర్వాత హరీష్ కెరీర్ పై ప్రశ్నలు తలెత్తాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో హీరోలు దర్శకుల సెలెక్షన్ విషయంలో జాగ్రత్త పడుతుంటారు. ఫ్లాప్ ట్రాక్ లో ఉన్న దర్శకులకు సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడంలో కొంత వరకు ఆలోచిస్తారు. కానీ బాలయ్య మాత్రం వేరు. కథ నచ్చితే దర్శకుడి గత రిజల్ట్స్ ను పెద్దగా పట్టించుకోరని తెలిసిందే.
టాలెంట్ ను నమ్మి అవకాశాలు ఇవ్వడం బాలయ్య స్టైల్. ఆ కారణంతోనే ఇప్పుడు హరీష్ శంకర్ కు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. మరో విషయమేమిటంటే ఇప్పుడు హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మంచి హిట్ గా నిలిస్తే హరీష్ కు మళ్లీ మాస్ డైరెక్టర్ గా స్ట్రాంగ్ రీఎంట్రీ దక్కే అవకాశం ఉంది.
అప్పుడు బాలయ్య ప్రాజెక్ట్ కూ మరింత బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్, బిజినెస్ పరంగా కూడా హైప్ పెరుగుతుందనే చెప్పాలి. ఏదేమైనా బాలయ్య- హరీష్ శంకర్ కాంబో నిజమైతే మాస్ ప్రేక్షకులకు పండగే. పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.