సూర్య హైట్ గురించి ఆగని ఫైట్

Update: 2018-01-21 04:18 GMT
మొన్నోసారి సన్ టీవీ మ్యూజిక్ ఛానల్ లో ఇద్దరు యాంకర్లు అత్యుత్సాహంతో హీరో సూర్య గురించి అభ్యంతర కరమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అతని హైట్ తక్కువని, తన సినిమాలో అమితాబ్ తో కనక కలిసి నటిస్తే స్టూల్ వేసుకుని నిలబడాల్సి వస్తుందని వెకిలిగా చెప్పడం పెద్ద దుమారమే రేపింది.ఫాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సన్ టీవీ కార్యాలయం ఏకంగా ధర్నా చేసినంత పని చేసారు. దీనికి స్పందించిన సూర్య తన అభిమానులు ఇలాంటి వాటిలో తల దూర్చడం తనకు ఇష్టం ఉందని. ఏదైనా ప్రయోజనం కూడిన పనుల్లో భాగం అవ్వండి తప్ప ఇలాంటి వాటిలో కాదని మెసేజ్ పెట్టడంతో ఫ్యాన్స్ కొంత శాంతించారు.సూర్య చాలా మంచి పని చేసాడు. వాళ్ళ పనులను మౌనంగా చూస్తే పరిస్థితి చేయి దాటిపోవడం ఖాయమని గుర్తించే వాళ్ళకు హితవు పలికాడు.

ఇది ఇక్కడితో ఆగలేదు. నడిగర్ సంఘం తరఫున సన్ యాజమాన్యానికి నోటీసులు వెళ్ళాయి. ఒక స్టార్ హీరో పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ - వీటికి బాధ్యత వహిస్తూ వివరణ ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొంది. మొన్న ప్రోగ్రాం చూసిన వెంటనే హీరో విశాల్ తన ట్విట్టర్ ద్వారా యాంకర్లు వేసిన జోకుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. రేటింగ్స్ కోసం - ప్రేక్షకులను నవ్వించడం కోసం ఇంత వెకిలిగా కామెంట్ చేయటాన్ని కోలీవుడ్ సీనియర్ నటులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇలాంటి వాటిని భరిస్తే ముందు ముందు సీనియర్ నటుల మీద హాస్యం పేరుతో అపహాస్యం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ మొత్తం వివాదంలో ఆకట్టుకుంటున్నది హుందాగా నిలిచిన హీరో సూర్య ప్రవర్తన. ఆ యాంకర్ల గురించి పల్లెత్తు మాట అనకుండా తన అభిమానులనే నిలవరించే ప్రయత్నం చేయటం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. టాలీవుడ్ లో కూడా ఈ మధ్య ఇలాంటి అభిమానుల తీరుని గమనిస్తునప్పటికి అవి త్వరగా కట్టడి కావడం లేదు. దీనికి తోడు కొన్ని న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ కోసం ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం గమనిస్తూనే ఉన్నాం. నడిగర్ నోటీసుకి సన్ టీవీ ఏం చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News