తేజ కీలక నిర్ణయం.. అలా అస్సలు చేయడట..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు సోలో హీరోగా అదరగొడుతున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు సోలో హీరోగా అదరగొడుతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పిస్తున్నారు. తాజాగా తేజ సజ్జా ఓ చిట్ చాట్ లో పాల్గొన్నారు.
ఆ సమయంలో ఆసక్తికరమైన విషయాలను తేజ షేర్ చేసుకోగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి.. అనేక స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆరిస్ట్ గా నటించిన తేజ.. ఓ బేబీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జాంబి రెడ్డి చిత్రంతో సోలో హీరోగా మారి.. ఇప్పుడు దూసుకుపోతున్నారు.
అయితే ఓ బేబీ కన్నా ముందే సోలో హీరోగా తేజకు ఆఫర్స్ రాగా.. వాటిని ఆయన రిజెక్ట్ చేశారట. ఆ విషయాన్ని స్వయంగా ఇప్పుడు చిట్ చాట్ లో వెల్లడించారు. ఓ బేబీ సినిమాకు ముందే సోలో హీరోగా సినిమా ఆఫర్లు వచ్చినా.. ముందుగా ప్రేక్షకులు, కుటుంబాలు తన ఫేస్ ను సరిగ్గా గుర్తించాలని ఉద్దేశంతో అంగీకరించలేదని చెప్పారు.
ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దదిగా మారిందని తేజ తెలిపారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు పిల్లలు థియేటర్స్ కు వస్తే ఇండస్ట్రీ ఇంకా ఎక్స్టెండ్ అవుతుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తానెప్పుడూ అడల్ట్ కంటెంట్ కు నో చెబుతానని, అలాంటి సీన్స్ చూసేందుకు తనకు అభ్యంతరం లేదని చెప్పారు.
కానీ తన సినిమాలు చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ తమ పిల్లలతో కలిసి థియేటర్లకు వస్తున్నారని చెప్పిన తేజ.. వాళ్లంతా ఇబ్బంది పడతారని అన్నారు. అందుకే అలాంటి కంటెంట్ లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ పై కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
అందరినీ ట్రోల్ చేయడం కామన్ అయిపోయిందని, నేషనల్ అవార్డులు వచ్చిన వారిపై కూడా విమర్శలు చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. వాళ్లు అలా అంటున్నారని మనం ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేమని, అందుకే టాలెంట్ ను నమ్ముకుంటూ కెరీర్‌లో ముందుకెళ్లాలని తెలిపారు. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా వాస్తవాలు బయటికొస్తాయని అన్నారు.
ఏదేమైనా టైమ్ వచ్చినప్పుడు మన వాల్యూ తెలుస్తుందని, విమర్శించే వారిని దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడూ వర్క్ చేయలేమని అన్నారు. ఎవరైనా.. ఆడియన్స్ ను కొత్త కొత్త కథలతో ఎలా అలరించాలనే విషయంపైనే ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తేజ సజ్జా చేసిన కామెంట్స్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.