అదరహో అనిపిస్తున్న అనన్య అందాలు..

అనన్య పాండే.. బాలీవుడ్ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తాజాగా నటించిన చిత్రం 'తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ'.;

Update: 2025-12-26 12:30 GMT

అనన్య పాండే.. బాలీవుడ్ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తాజాగా నటించిన చిత్రం 'తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ'. కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజే 8.46 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సమీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తోంది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సినిమా నిన్న థియేటర్లలోకి రావడంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను అలాగే ఆ సినిమా షూటింగ్ సంబంధించిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంది అనన్య పాండే. అంతేకాదు బికినీ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్ డోస్ పెంచేసి బికినీ అందాలతో రచ్చ రేపింది అనన్య పాండే. పైగా ఈ సినిమా షూటింగ్ సమయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం అనన్య పాండే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అనన్య పాండే విషయానికి వస్తే తెలుగులో తొలిసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం లైగర్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈమెకు మళ్ళీ అవకాశాలు తలుపు తట్టలేదు. అయితే ఈసారి హీరోయిన్గా అవకాశం లభించలేదు. కానీ స్పెషల్ సాంగ్ కోసం ఒక చిత్ర యూనిట్ ఈమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్.. తాజాగా నటిస్తున్న చిత్రం లెనిన్. మురళి కే కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ , సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందని అందుకోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేని ఎంపిక చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఈ వార్త నిజమైతే అనన్య తన స్పెషల్ సాంగ్ తో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

అనన్య పాండే విషయానికి వస్తే.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ అందాలతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈసారైనా తెలుగులో ఈమెకు అదృష్టం తలుపు తడుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News