టాలీవుడ్ టాప్ డీల్స్.. నైజాం నవాబులెవరు?

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నైజాం ఏరియా అంటే ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మార్కెట్ మాత్రమే స్టార్స్ సినిమా రేంజ్ ఏంటో డిసైడ్ చేస్తుంటుంది.;

Update: 2026-02-10 08:30 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నైజాం ఏరియా అంటే ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మార్కెట్ మాత్రమే స్టార్స్ సినిమా రేంజ్ ఏంటో డిసైడ్ చేస్తుంటుంది. అందుకే మన స్టార్ హీరోలందరూ ఈ ఏరియాపై కాస్త స్పెషల్ గా ఫోకస్ చేస్తారు. ఈ మధ్య కాలంలో సినిమాల బడ్జెట్లు పెరగడంతో పాటు థియేట్రికల్ రైట్స్ రేట్లు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోల సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు ఎంతైనా పెట్టడానికి రెడీ అయిపోతున్నారు.

సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ మీద అంచనాలు డబుల్ అవుతాయి. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా మునుపటి రికార్డులను తిరగరాస్తున్నాయి. నైజాం మార్కెట్ లో పట్టు సాధించడానికి అటు మైత్రీ వంటి బడా నిర్మాణ సంస్థలు, ఇటు దిల్ రాజు లాంటి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. భారీ సినిమాలు లైన్లో ఉన్నప్పుడు థియేటర్ల దగ్గర సందడి ఏ స్థాయిలో ఉంటుందో, రైట్స్ విషయంలో కూడా అదే రేంజ్ లో డీల్స్ కుదురుతున్నాయి.

లేటెస్ట్ గా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ దాదాపు 60 నుంచి 65 కోట్ల వరకు కోట్ చేస్తున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం 50 కోట్ల దగ్గర బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. చరణ్ గ్లోబల్ ఇమేజ్ బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ పై ఉన్న నమ్మకంతోనే ఈ రేంజ్ లో ఆఫర్స్ వస్తున్నాయి. ఇదివరకు వచ్చిన ప్రభాస్, బన్నీ సినిమాలు క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఇప్పుడు 'పెద్ది' కి ఒక సవాల్ గా మారింది.

​గతంలో వచ్చిన సినిమాల బిజినెస్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అల్లు అర్జున్ 'పుష్ప 2' వంద కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ తో అగ్రస్థానంలో నిలవగా, పవన్ కళ్యాణ్ 'ఓజీ' 90 కోట్లతో తన పవర్ ఏంటో చూపించింది. అలాగే ఎంతో కాలంగా రికార్డుగా ఉన్న 'RRR' 75 కోట్లు, ప్రభాస్ 'సలార్', 'కల్కి 2898 AD' వంటి చిత్రాలు 65 కోట్ల చొప్పున బిజినెస్ చేశాయి. ఇప్పుడు 'పెద్ది' కూడా అదే 65 కోట్ల క్లబ్ లో చేరాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నైజాం థియేట్రికల్ రైట్స్ రికార్డులు:

పుష్ప 2: రూ. 100 కోట్లు

ఓజీ: రూ. 90 కోట్లు

RRR: రూ. 75 కోట్లు

సలార్: రూ. 65 కోట్లు

కల్కి 2898 AD: రూ. 65 కోట్లు

Tags:    

Similar News