కబాలి డైరెక్టర్.. 5:35 అంటున్నాడు

Update: 2016-07-26 08:23 GMT
రెండే రెండు సినిమాలు తీసిన కుర్ర డైరెక్టర్ కి.. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి హీరోతో సినిమా ఛాన్స్ అంటే మాటలు కాదు. అతడి ట్యాలెంట్ పై విపరీతమైన నమ్మకం ఉంటేనే ఇది సాధ్యం. అందుకే రజినీతో కబాలి మూవీ చేయగలిగాడు దర్శకుడు పా రంజిత్. దీనికి ముందు ఈ దర్శకుడు రెండు సినిమాలు తీశాడు. ఒకటి అరంగేట్ర మూవీ అట్టకత్తి అయితే.. రెండోది కార్తితో చేసిన మద్రాస్.

కబాలి విషయంలో రజినీలాంటి స్టార్ ని డీల్ చేయడంలో పా రంజిత్ ఘోరంగా విఫలమయ్యాడు. స్టార్స్ ని డీల్ చేయడంలో తన వీక్నెస్ ని బయటపెట్టుకున్నాడు. అసలు కబాలి విడుదల కాకముందే.. కోలీవుడ్ స్టార్ సూర్యతో ఓ సినిమా ఫైనల్ అయింది. అయితే.. కబాలి ఫెయిల్యూర్ తర్వాత ఈ ప్రాజెక్టుపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీటిని తొలగిస్తూ.. కొత్త ప్రాజెక్టును.. టైటిల్ తో సహా పోస్టర్ ఇచ్చేశాడు పా రంజిత్.

సినిమా టైటిల్ 5.35.. కరెక్టే అది టైమే.. ఐదు గంటల ముప్ఫై ఐదు నిమిషాలు అని అర్ధమయ్యేలా పోస్టర్ ప్రింట్ చేశాడు. అందులో సూర్య కండలు తిరిగిన బాడీతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే సూర్య ఫ్యామిలీకి ఓ హిట్ ఇవ్వడంతో.. ఈ మూవీపై కూడా అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది.
Tags:    

Similar News