ఇట్స్ అఫిసియల్: స్టైలిష్ డైరెక్టర్ తో పవర్ స్టార్...!

Update: 2020-09-02 05:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ పవన్ - సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా అనౌన్స్ చేశారు. పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలు అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తాడనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ పోస్టర్ లో పవన్ కెరీర్లో ఇది ఎన్నో సినిమాగా రాబోతుందో ప్రకటించలేదు.

కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. వీటిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే పవన్ - హరీష్ ప్రాజెక్ట్ పవర్ స్టార్ కెరీర్లో 28వ చిత్రమని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు రామ్ తాళ్లూరి నిర్మించే సినిమా 'వకీల్ సాబ్' పూర్తయిన వెంటనే సెట్స్ మీదకు వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో క్రిష్ సినిమాని హోల్డ్ లో పెడతారా లేదా హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెడతారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ నేడు పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అప్డేట్స్ వస్తే పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబోలో రాబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News