శ్రేయా ఘోషల్ కోటి వెలుగుల ఇల్లు!

ప్ర‌ఖ్యాత గాయ‌ని శ్రేయా ఘోషల్ ఈసారి పాట‌తో కాకుండా ముంబై నగరంలో కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన ఆస్తితో అందరి దృష్టిని ఆకర్షించారు.;

Update: 2026-04-07 03:15 GMT

ప్ర‌ఖ్యాత గాయ‌ని శ్రేయా ఘోషల్ ఈసారి పాట‌తో కాకుండా ముంబై నగరంలో కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన ఆస్తితో అందరి దృష్టిని ఆకర్షించారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచిన వర్లీ లో ఆమె ప్రీమియం అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసారు. శ్రేయా ఘోషల్ ఈ కొత్త ఇంటి కోసం ఏకంగా30 కోట్లు వెచ్చించారు. వర్లీలోని ప్రతిష్టాత్మకమైన హై-రైజ్ టవర్‌లో ఈ ఫ్లాట్ ఉంది. 3169 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ క‌ల‌దు. ఈ ప్లాట్ ఆధునిక వసతులతో కూడిన రాజభవనాన్ని తలపిస్తోంది. కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్త‌యింది.

ఈ డీల్ కోసం శ్రేయా ఘోషల్ భారీ మొత్తంలో స్టాంప్ డ్యూటీని చెల్లించారు. దాదాపు 1.8 కోట్లు ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసి ఈ ఆస్తిని తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు ఆమెకు మూడు ప్రత్యేకమైన కార్ పార్కింగ్ స్లాట్లు కూడా కేటాయించబడ్డాయి. ముంబై వంటి నగరంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఆమె ఆర్థిక ఎదుగుదలకు నిదర్శనంగా చెప్పొచ్చు. వర్లీ ప్రాంతం ముంబైలో సెలబ్రిటీలు ,బిలియనీర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్లు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

సముద్రపు తీరానికి దగ్గరగా ఉండటం, అద్భుతమైన వ్యూ పాయింట్స్ ఉండటంతో ఈ ప్రాంతంలో ప్రాపర్టీ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రేయా ఘోషల్ కూడా తన అభిరుచికి తగ్గట్టుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం విశేషం.

వృత్తిపరంగా శ్రేయా ఘోషల్ కెరీర్‌లో అత్యున్నత దశలో ఉన్నారు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ పాటలు పాడుతూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా ఉత్సవంలో ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డును అందుకోవడం ఆమె పాపులారిటీకి అద్దం పడుతోంది. పాటలతోనే కాకుండా, ఇటు స్థిరాస్తి రంగంలోనూ ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు.

శ్రేయా ఘోషల్ కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన ఇల్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చి తన కష్టంతో ప్రతిభతో ఇంతటి స్థాయికి చేరుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తోంది. త్వరలోనే ఆమె తన కొత్త గృహ ప్రవేశానికి సంబంధించిన వేడుకను కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ అపార్ట్‌మెంట్ కేవలం నివాసం మాత్రమే కాదు. భవిష్యత్తులో శ్రేయ‌ సంగీత సాధన కోసం ఒక ప్రత్యేకమైన స్టూడియోను కూడా ఇందులో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడం ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే జాన్వీ కపూర్, అమితాబ్ బచ్చన్ వంటి తారలు వర్లీ , జుహు ప్రాంతాల్లో భారీ ఆస్తులను సొంతం చేసుకోగా తాజాగా శ్రేయా కూడా ఆ జాబితాలో చేరి తన స్టార్ హోదాను మరోసారి చాటుకున్నారు. అద్భుతమైన గాత్రంతోనే కాక‌ ఇలాంటి క్రేజీ ఇన్వెస్ట్‌మెంట్లతోనూ ఆమె వార్తల్లో నిలుస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

Tags:    

Similar News