డెకాయిట్.. బుకింగ్స్ ఎలా ఉన్నాయి?
ఇక హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్’ అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా, ప్రధాన మల్టీప్లెక్సుల్లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.;
అడివి శేష్ అనగానే ప్రేక్షకులకు ఒక రకమైన నమ్మకం ఉంటుంది. కథలో విషయం ఉంటేనే అతను ప్రాజెక్ట్ ఓకే చేస్తారనే పేరు సంపాదించుకున్నారు. సుమారు నాలుగేళ్ల తర్వాత ‘డెకాయిట్’ సినిమాతో థియేటర్లలోకి వస్తున్నారు. శనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఇంటెన్స్ రోమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కావడంతో ఈ జోడీపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లోని యాక్షన్ విజువల్స్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో ఒక క్లారిటీ ఇచ్చాయి.
ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు కూడా గట్టిగానే చేస్తున్నారు. అడివి శేష్ తన మార్క్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ఇందులో కూడా కొనసాగించినట్లు తెలుస్తోంది. ఒక డెకాయిట్ జీవితంలో ప్రేమ, ప్రతీకారం అనే అంశాలను ఎలా జోడించారనేది ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి హేమాహేమీలు ఉండటం ఈ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది.
ఇక హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్’ అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా, ప్రధాన మల్టీప్లెక్సుల్లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా ఏఎంబి సినిమాస్‌లో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే 5 కి 5 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. అలాగే ART సినిమాస్‌లో కూడా 4 కి 5 షోలు దాదాపు నిండిపోవచ్చాయి.
హైదరాబాద్ లోని ఐకానిక్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఉదయం 8 గంటల షోకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. పెద్ద సినిమాల తరహాలో ఈ సినిమాకు కూడా ఎర్లీ మార్నింగ్ షోలు ప్లాన్ చేయడం, వాటికి ప్రేక్షకులు ఎగబడడం విశేషం. కేవలం మల్టీప్లెక్సులే కాకుండా సింగిల్ స్క్రీన్లలో కూడా బుకింగ్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అడివి శేష్ కు ఉన్న ఫాలోయింగ్ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో స్పష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ సిటీలో బుకింగ్ ట్రెండ్స్ ఇలా ఉండటం వల్ల ఓపెనింగ్స్ పరంగా సినిమా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. వీకెండ్ బుకింగ్స్ కూడా ఇప్పటికే జోరందుకున్నాయి.
మృణాల్ ఠాకూర్ కు ఉన్న క్రేజ్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ల వైపు రప్పించేలా చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లు బాగుంటాయనే టాక్ రావడంతో యూత్ కూడా బుకింగ్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ స్థాయిలో బుకింగ్స్ నమోదు కావడం అంటే సినిమాపై ఆడియన్స్ లో ఉన్న క్యూరియాసిటీ ఏంటో అర్థమవుతోంది. చాలా గ్యాప్ తరువాత అడివి శేష్ ‘డెకాయిట్’ తో బాక్సాఫీస్ వద్ద ఒక గ్రాండ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపిస్తున్న ఈ ఊపు రేపు థియేటర్లలో కలెక్షన్ల రూపంలో ఎంతవరకు కనిపిస్తుందో చూడాలి. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం శేష్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ చేరినట్లే. మరి ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఈ డెకాయిట్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో వేచి చూడాలి.