శాశ్వత్ మరో అనిరుధ్ అవుతాడా? ఒక్క హిట్ పడితే చాలా?

కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ లాగానే ఇప్పుడు మరో యువ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్ దేవ్..;

Update: 2026-04-07 03:00 GMT

కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ లాగానే ఇప్పుడు మరో యువ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్ దేవ్.. తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకోనున్నారా ? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి తమిళంలో 3 సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన అనిరుధ్, ఆ మూవీ తెలుగు వెర్షన్‌ లో పాటలతో పాపులర్ అయినప్పటికీ, అజ్ఞాతవాసి చిత్రంతోనే టాలీవుడ్‌ లో డైరెక్ట్ గా అడుగుపెట్టారు.

ఆ సినిమా రిజల్ట్ పక్కనపెడితే.. మూవీలోని సాంగ్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత అనిరుధ్ రవిచందర్ టాలీవుడ్‌ లో అతి తక్కువ సమయంలోనే తనదైన శైలి సంగీతంతో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. దేవర, జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి వంటి హిట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్‌ తో తెలుగు ప్రేక్షకులను మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.

ఇప్పుడు అల్లు అర్జున్- అట్లీ మూవీ, నాని ప్యారడైజ్ సహా అనేక సినిమాలకు వర్క్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన లాగానే తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగేందుకు శాశ్వత్ సచ్ దేవ్ సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే శాశ్వత్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా... ఆయన ఎవరో కాదు.. రీసెంట్ గా ధురంధర్ సిరీస్ చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న బీటౌన్ మ్యూజిక్ డైరెక్టర్.

ఆ రెండు సినిమాలకు గాను తన వర్క్ తో తెలుగు ఆడియన్స్ లో స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్నారు. అంతే కాదు.. ఇప్పుడు వివిధ బడా టాలీవుడ్ సినిమాలకు వర్క్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ సమర్పణలో యంగ్ హీరో నిఖిల్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్ కు పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన అవుట్ పుట్ ను ఇప్పటికే మూవీ టీమ్ అంతా మెచ్చుకుందట.

అదే సమయంలో నేచురల్ స్టార్ నాని లైనప్ లో ఉన్న ఓ సినిమాకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఓజీ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో నాని చేయనున్న బ్లడీ రోమియో చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని.. త్వరలో మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

ఆ తర్వాత లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్న తదుపరి చిత్రం ఆర్‌సీ 17 కోసం కూడా శాశ్వత్‌ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. మరిన్ని టాలీవుడ్ బడా సినిమాల మేకర్స్ కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శాశ్వత్ కు తెలుగులో ఒక్క హిట్ పడితే చాలు.. అవకాశాలు పెద్ద ఎత్తున వస్తాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News