సన్నీ వార్ మొదలైంది

Update: 2018-02-07 13:09 GMT
హాట్ బ్యూటీ సన్నీ లియెన్ ప్రస్తుతం కథలను ఎంచుకుంటున్న తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నీలి చిత్రాల నుంచి వచ్చిన ఈ బ్యూటీ అందానికి ఇక్కడ చాలా మంది ఫిదా అవుతున్నారు. మొదట్లో ఇండియన్ సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు కేవలం స్పెషల్ సాంగ్స్ కె పరిమితమైన సన్నీ కొద్దీ కాలంలోనే ఏకంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి రెడీ అయ్యింది.

ఆఫర్స్ చాలా వస్తున్నప్పటికీ నటిగా ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే..అమ్మడు గతంలో ఒక హిస్టారికల్ డ్రామా సినిమాలో నటిస్తున్నట్లు న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. సన్నీ గతంలో సినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేసింది. వీర మహాదేవి అనే ఆ సినిమా తెలుగుతో పాటు తమిళ్ మలయాళం అలాగే హిందీలో కూడా దర్శకుడు విసి.వడిఉడైయాన్ తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా చెన్నైలో అధికారికంగా సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు.

ఇక నుంచి రెగ్యులర్ షూటింగ్ ని కొనసాగించనున్నట్లు నిర్మాత స్టీపెన్ తెలిపాడు. సన్నీ ఈ సినిమా షూటింగ్ కోసం 150 రోజుల కాల్షీట్స్ ఇచ్చిందట. ఇంతకుముందు సినిమా కోసం నిర్వహించిన వర్క్ షాప్ లో సన్నీ హార్స్ రైడింగ్ కత్తి యుద్దాలు అలాగే ఇతర యాక్షన్ సీక్వెన్స్ కు సంబందించిన పోరాటాలను బాగా అలవాటు చేసుకుందట. ఇక సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ మొదట్లోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  
Tags:    

Similar News