• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌ క్లిక్‌ : ముద్దులతో...

పిక్‌ క్లిక్‌ : ముద్దులతో బిగ్ బ్రదర్‌ లవ్‌

By - Tupaki Desk
Update: 2021-08-03 08:30 GMT
యంగ్‌ హీరో సందీప్‌ కిషన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా లో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ క్రియేటర్స్ రాజ్ అండ్‌ డీకే లు నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ను ప్రారంభించారు. తాజాగా సందీప్‌ కిషన్‌ తో తమిళ ట్యాలెంటెడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి జాయిన్‌ అయ్యారు. ఈ సందర్బంగా వారు తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

సందీప్‌ కిషన్‌ ఈ ఫొటోలను షేర్‌ చేశాడు. బిగ్‌ బ్రదర్‌ లవ్‌ అంటూ లవ్‌ ఈమోజీని షేర్‌ చేసిన సందీప్‌ కిషన్‌ ఈ పిక్స్ ను పంచుకున్నాడు. విజయ్‌ సేతుపతి మరియు సందీప్‌ కిషన్‌ లు ఎంతో ఆప్యాయంగా అన్నదమ్ముల మాదిరిగా ముద్దులు పెట్టుకుంటున్న ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సందీప్‌ కిషన్‌ తో గతంలోనే రాజ్ మరియు డీకేలు సినిమాను చేశారు. ఈసారి వారి నిర్మాణంలో సినిమా రూపొందబోతుంది.

ఈ సినిమాకు తమిళ దర్శకుడు రంజిత్‌ జయకొడి దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్‌ మరియు డీకేలు ఈ సినిమాను భరత్‌ చౌదరితో కలిసి తెలుగు మరియు తమిళంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ రాజ్ మరియు డీకే లకు నచ్చడం వల్ల సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సందీప్‌ కిషన్‌ తో వీరి సినిమా అనగానే అంచనాలు పెరిగాయి... ఇక ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడు అనడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ఇద్దరు ఈ సినిమాలో హీరో విలన్‌ గా కనిపించబోతున్నారా లేదంటే మరేదైనా ప్రత్యేక పాత్రలో విజయ్‌ సేతుపతి కనిపించబోతున్నాడా అనేది చూడాలి. ఉప్పెన సినిమాతో విజయ్‌ సేతుపతికి టాలీవుడ్‌ లో స్టార్‌ డం దక్కింది. ఆయన నటన మరియు ఆయన హ్యూమనిటీకి అంతా కూడా ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌ లో అనూహ్యంగా అభిమానులను దక్కించుకున్న విజయ్‌ సేతుపతి ఈ సినిమా కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడు అనడం లో సందేహం లేదు.

ఇక రాజ్ మరియు డీకే లు ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ రెండు పార్ట్‌ లతో దేశంలోనే టాప్‌ దర్శకులుగా మారిపోయారు. వారు ఒక వైపు దర్శకులుగా కొనసాగుతూనే మరో వైపు నిర్మాతలుగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇటీవలే సినిమా బండి అనే ఒక చిన్న కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీని నిర్మించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అన్ని విధాలుగా విజయ్‌ సేతుపతి మరియు సందీప్‌ లకు ఈ సినిమా మరింతగా స్టార్‌ డమ్‌ పెంచుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా సక్సెస్‌ తో రాజ్‌ మరియు డీకేలు మరిన్ని తెలుగు సినిమాలు చేస్తారని టాలీవుడ్ వర్గాల వారు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సందీప్‌ కిషన్‌ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్ చిత్రాలను ఎంపిక చేస్తూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ ఉన్నాడు. ఈయన సినిమాలు కమర్షియల్‌ గా నిరాశ పర్చినా కూడా కంటెంట్‌ పరంగా పాజిటివ్‌ గా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి సందీప్‌ కిషన్‌ సినిమా లో విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడు అంటే ఖచ్చితంగా మంచి సినిమా కథ అయ్యి ఉంటుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్‌ సేతుపతికి ఉన్న కమిట్‌ మెంట్స్‌ నేపథ్యంలో సాదా సీదా పాత్రలను కథలను ఒప్పుకునే అవకాశం లేదు. అందుకే ఈ సినిమా ను ఆయన ఒప్పుకున్నాడు కనుక ఖచ్చితంగా సినిమా లో మ్యాటర్ ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్‌ డేట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tags:    
  • Vijay Sethupathi 
  • sundeep kishan 
  • Raj And DK 
  • Sangha Tamizhan 
  • rajanddk 
  • d for dopidi 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS