దక్షిణాది చిత్రాల్లో భారీ అంటే... అందరికీ గుర్తొచ్చేది దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి. అయితే, అంతకంటే భారీ చిత్రాన్ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. ఇటీవలే అరణ్మని -2 తో భయపెట్టిన సుందర్.. త్వరలోనే అతి భారీ బడ్జెట్ చిత్రం చేయబోతున్నారు. ఇంతకీ, ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా... సౌత్ నుంచే ఒక సూపర్ స్టార్ ఉంటారని తెలుస్తోంది. ఇలైతలపతి విజయ్ - సూర్య - సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ముగ్గురి పేర్లూ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సాంకేతిక వర్గానికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని ఫైనలైజ్ చేసినట్టు తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ స్వరాలు అందిస్తారట. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ. గ్రాఫిక్స్ - ఆర్ట్ డిపార్ట్‌మెంట్లు సాబు సైరిస్ కి అప్పగించారు. అంతేకాదు, ఈ చిత్రానికి ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సంఘమిత్ర సినిమాను మొత్తంగా 11 దేశాల్లో చిత్రీకరిస్తారట. ఇండియా - డెన్మార్క్ - అమెరికా - ఉక్రెయిన్ తోపాటు ఇంకొన్ని దేశాల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇంతవరకూ ఏ భారతీయ చిత్రం కూడా మహా అయితే ఆరు దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. కానీ, సంఘమిత్ర మాత్రం ఏకంగా 11 దేశాల్లో షూటింగ్ అంటే... అదీ ఒక రికార్డే అవుతుంది.
సంఘమిత్ర గురించి దర్శకుడు సుందర్ మాట్లాడుతూ ‘స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తైంది. ప్రస్తుతం తారాగణం గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇంతవరకూ ఏ నటుడి పేరునూ ఖరారు చేయలేదు’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు - తమిళ - హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. మొత్తం రూ. 350 కోట్లు బడ్జెట్ తో శ్రీ తెనెందాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సో... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు దర్శకుడు సుందర్ సి. రెడీ అవుతున్నారు.