ఫస్ట్‌లుక్‌ : హీరో డెత్‌ మిస్ట్రరీపై సినిమా

Update: 2020-07-20 12:30 GMT
బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య పై పలు అనుమానాలు ఉన్నాయి. పోలీసులు పోస్ట్‌ మార్టం మరియు ప్రాధమిక విచారణలో భాగంగా తెలుసుకున్న విషయాల ప్రకారం సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం అంతటి స్టార్‌ డం ఉన్న హీరో చిన్న చిన్న కారణాలతో డిప్రెషన్‌ కు గురై ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సుశాంత్‌ ఆత్మహత్య గురించి ఒక చిత్రంను రూపొందించబోతున్నారు. ఆ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు.

టిక్‌ టాక్‌ లో మంచి ఫాలోయింగ్‌ దక్కించుకున్న సచిన్‌ తివారీ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. సుశాంత్‌ బాడీ లాంగ్వేజ్‌ ను బాగా మ్యానేజ్‌ చేయడంతో పాటు చూడ్డానికి సుశాంత్‌ మాదిరిగా ఉండే ఈయన్ను మేకర్స్‌ ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంకు విజయ్‌ శేఖర్‌ గుప్త దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంను సెప్టెంబర్‌ నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.

డిసెంబర్‌ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ‘సుసైడ్‌ ఆర్‌ మర్డర్‌’ అనే టైటిల్‌ తో విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. సుశాంత్‌ మరణించి ఇంకా నెల రోజులే అయిన నేపథ్యంలో ఆయన జ్ఞాపకాల్లోనే ఉన్న అభిమానులు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. సుశాంత్‌ ఆత్మహత్య ప్రశ్నలకు ఈ సినిమా సమాధానం చెబుతుందని చాలా మంది ఆశిస్తున్నారు.
Tags:    

Similar News