1+1=5... తప్పని వాదించాల్సిన అవసరం లేదు

ఈ మధ్య కాలంలో ఇండియాలో అత్యధికంగా వినిపించిన సినిమా పేర్లలో 'ధురంధర్‌' ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.;

Update: 2026-02-09 08:22 GMT

ఈ మధ్య కాలంలో ఇండియాలో అత్యధికంగా వినిపించిన సినిమా పేర్లలో 'ధురంధర్‌' ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్‌ గుండెల్లో దేశ భక్తిని పెంచే విధంగా ఉంది అంటూ రివ్యూలు వచ్చాయి. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాల్సిందే అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇతర దేశ భక్తి సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంది, ఈ సినిమాకు ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించగా, రణ్‌వీర్ సింగ్‌, అర్జున్‌ రాంపాల్‌, ఆర్‌ మాధవన్‌, రాకేష్ బేడీ, సంజయ్‌ దత్‌ తదితరులు ముఖ్య పాత్రలో నటించాడు. మాధవన్‌ ఈ సినిమాలో అజయ్‌ సన్యాల్‌ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. ఈ పాత్ర నిజ జీవిత NSA అజిత్ దోవల్ నుండి ప్రేరణ పొందింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అజయ్‌ సన్యాల్‌ పాత్రలో మాధవన్‌

ఆర్ మాధవన్‌ ఈ మధ్య కాలంలో ఇలాంటి పాత్రలు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా, స్టార్‌ డం ను పక్కన పెట్టి, వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేసే విధంగా తన పూర్తి ఎఫర్ట్‌ పెడుతున్నారు అంటూ అజయ్‌ సన్యాల్‌ పాత్రలో ఆయన్ను చూస్తే అర్థం అవుతుంది. ఆయన సినిమాలో కనిపించింది కొంత సమయం అయినా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్ర కావడంతో సినిమా విడుదల అయినప్పటి నుంచి ఆయన గురించి చర్చ జరుగుతోంది. సినిమాలో ఆయన పాత్ర గురించి చర్చ జరగడం ఒక ఎత్తు అయితే, ఆయన సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోలు, కోట్స్‌, ఎమోషనల్‌, అండ్‌ ఇన్సిపిరేషన్‌ కోట్స్ ను షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. వాటి గురించి కూడా రెగ్యులర్‌గా చర్చ జరగడంతో ఆర్ మాధవన్ ఎప్పటికప్పుడు మీడియాలో వ్యక్తిగా మారి పోయాడు.

హాలీవుడ్‌ స్టార్‌ కీను రీవ్స్ సోషల్‌ మీడియా పోస్ట్‌

తాజాగా మరోసారి ఆయన సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఒక కోట్‌ కారణంగా వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆయన హాలీవుడ్‌ నటుడు స్టార్‌ కీను రీవ్స్ షేర్‌ చేసిన కోట్‌ ను రీ షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ కోట్‌ తనను చాలా ఆకర్షించింది అని, అంతే కాకుండా దానిలోని సారాంశం తన ఆలోచన తీరును మార్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకు ఆ కోట్‌ లో ఏముంది అంటే... మీరు 1+1=5 అని చెప్పినా, మీరు చెప్పింది నిజమే... మీరు అనుకున్నదే కానివ్వండి, ఆనందించండి అన్నట్లుగా ఉంటాను అని ఆ కోట్‌ లో ఉంది. నేను జీవితంలో చర్చలకు దూరంగా ఉండే దశలో ఉన్నాను. కనుక మీరు ఏం చెప్పినా ఏకీభవించేందుకు సిద్ధమే అన్నట్లుగా ఆ కోట్‌ అర్థం వస్తుంది. ఇది మాధవన్‌ షేర్‌ చేసి కీను రీవ్స్ రాసిన ఈ కోట్‌ ఎంతో మందికి కచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ధురంధర్‌ 2 సినిమా విడుదల తేదీ..

గతంలోనూ ఆర్‌ మాధవన్‌ పలు రకాల కోట్స్ ను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. విభిన్నమైన కథలను, పాత్రలను ఎంపిక చేసుకుంటూ సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో స్టార్‌గా కొనసాగుతున్న మాధవన్‌ త్వరలో ధురంధర్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 19, 2026 న రాబోతున్న ఈ సీక్వెల్‌ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండో భాగం సినిమా చాలా స్పెషల్‌ అని మేకర్స్ చెబుతున్నారు. సీక్వెల్‌ లో అజయ్‌ సన్యాల్‌ పాత్ర పరిధి ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ధురంధర్‌ 2 సినిమా తర్వాత మాధవన్ మరిన్ని మంచి పాత్రలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక సోషల్‌ మీడియాలో ఆయన మంచి మంచి కోట్స్ ను షేర్‌ చేస్తూ ఉండటం ద్వారా ఆయన్ను సోషల్‌ మీడియా ద్వారా ఫాలో అయ్యేయ వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూనే ఉంది.

Tags:    

Similar News