ఆ శాఖ అనుమతిస్తేనే స్టార్ హీరో రిలీజ్!
సాధారణంగా సినిమా రిలీజ్ కు సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉంటే చాలు రిలీజ్ ఆటంకం ఉండదు.;
సాధారణంగా సినిమా రిలీజ్ కు సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉంటే చాలు రిలీజ్ ఆటంకం ఉండదు. సినిమాను నిరభ్యంతరంగా థియేటర్లలలో రిలీజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల అనుమతులతో ఓ జారీ పత్రం ఉంటుంది. అభ్యంతరాలు ఏవైనా ఉన్నా? అక్కడే క్లియర్ అవుతుంటారు. అభ్యంతరకర సన్నివేశాలుంటే సెన్సార్ కట్ విధిస్తుంది. సినిమా రిలీజ్ వల్ల సమాజానికి, దేశ భద్రతకు నష్టం కలుగుతుందని సెన్సార్ భావిస్తే గనుక రిలీజ్ క్లియరెన్స్ ఇవ్వదు. ప్రతిగా నిర్మాతలు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అక్కడ నుంచి వ్యవహారం కోర్టు ఫరి దిలోకి వెళ్లిపోతుంది. అవసరం మేర ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి.
అయితే ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా ఇలాంటి పరిస్థితి ఓ బాలీవుడ్ సినిమాకు ఎదురైంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అపూర్వా లాఖియా దర్శకత్వంలో `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ అన్నంత అంత సులభం కాదు. చాలా రకాల అనుమతులు పొందిన తర్వాతే రిలీజ్ కు అయ్యే పరిస్థితి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో? `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` కు ఈ రకమైన పరిస్థితులు ఎదురైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు కేవలం సెన్సార్ ఒక్కటే క్లియరెన్స్ ఇస్తే సరిపోదు. సెన్సార్ తో పాటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అనుమతివ్వాలి. ఈ సినిమాను సెన్సార్ సభ్యులతో పాటు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ కూడా వీక్షించిన అనంతరం ఎలాంటి అభ్యంతరాలు లేవు అనుకుంటేనే రిలీజ్ అవుతుంది. ఆ శాఖ ఏమాత్ర అభ్యంతరం వ్యక్తం చేసినా సల్మాన్ ఖాన్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. నేరుగా మంత్రిత్వ శాఖ సినిమా వీక్షించడం అన్నది అంత సులభంగా జరిగే పని కాదు. అందుకు చాలా సమయం పడుతుంది.
ఆశాఖలో కీలక వ్యక్తలకు సమయం ఉండాలి. అప్పుడే సినిమా చూసేందుకు సమయాన్ని కేటాయించగలరు. `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ `కు ఎందుకా పరిస్థితి అంటే? భారత్-చైనా బలగాల మధ్య గాల్వానా లోయ ఘర్ణణ ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనేమైందో తెలిసిందే. భారత జవాన్లపై చైనా జవాన్లు మెరుపు దాడి చేయడంతో భాతర్ ప్రతి దాడి చేసింది. ఈ వీరోచిత పోరాటంలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు తోపాటు 20మంది అమరులయ్యారు.
చైనా నజవాన్లు కూడా చనిపోయారు. ఈ ఘటన ఆధారంగానే `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` తెరకెక్కుతోంది. సంతోష్ బాబు పాత్రలోనే సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. అప్పట్లో చైనా-భారత్ మధ్య సత్స సంబంధాలు కూడా సరిగ్గా లేవు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మైత్రీ బలపడుతోంది. అయినా ఈ సినిమాపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి పరిస్ఠితుల కారణంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి కూడా సినిమాకు తప్పని సరిగా మారింది.