ఆ డైరెక్ట‌ర్ భ‌యంక‌ర‌మైన గంద‌ర‌ గోళంలో!

మారుతి ఇండ‌స్ట్రీలో ఎలా ఎదిగాడు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంతింతై వ‌టుడింతైన చందంగా ఎదిగాడు.;

Update: 2026-02-09 08:20 GMT

మారుతి ఇండ‌స్ట్రీలో ఎలా ఎదిగాడు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంతింతై వ‌టుడింతైన చందంగా ఎదిగాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌మ‌కొచ్చి ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్ట‌ర్ కాక‌ముందు చిన్న‌ డిస్ట్రిబ్యూట‌ర్ గా, నిర్మాత‌గా ప‌ని చేసాడు. త‌న‌లో గొప్ప ట్యాలెంట్ ఉన్నా? నిరూపించుకునే అవ‌కాశం కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసాడు. దానిలో భాగంగానే పంపిణీదారుడు, నిర్మాత అనే ప్ర‌యాణం క‌నిపిస్తుంది. అలా వ‌చ్చిన ఐడెంటిటీతో త‌న‌లో క్రియేట‌ర్ ను బ‌య‌ట‌కు తెచ్చాడు. తొలి ప్ర‌య‌త్నం `ఈరోజుల్లో` అనే చిత్రాన్ని త‌క్కువ బ‌డ్జెట్ లోనే చేసి మంచి లాభాలు తెచ్చి పెట్టాడు.

దీంతో నిర్మాత‌ల‌కు అత‌డిపై న‌మ్మ‌కం మొద‌లైంది. అటుపై `బ‌స్టాప్` తో మ‌రోహిట్ అందుకున్నాడు. అలా మొద‌లైన మారుతి ప్ర‌యాణం `ది రాజాసాబ్` రిలీజ్ ముందుకు వ‌ర‌కూ తిరుగు లేకుండా సాగింది. ఆరంభంలోనే ప‌డిన ఓ సంచ‌ల‌న ట్యాగ్ ను కూడా క్లాసిక్ చిత్రాల‌తో తొల‌గించుకున్నాడు. అలా ఎదిగిన క్ర‌మంలో భ‌విష్య‌త్ లో స్టార్ హీరోతో సినిమా తీస్తే గ‌నుక అది ష్యూర్ షాట్ అవ్వాల‌ని ఆరోజే అనుకున్నాడు. వ‌చ్చిన ఓ గొప్ప అవ‌కాశంతో స్టార్ లీగ్ లో చేరిపోవాల‌ని డిసైడ్ అయ్యాడు. అగ్ర హీరోకి ఓ భారీ హిట్ ఇస్తే ప‌రిశ్ర‌మ‌లో వ‌చ్చే గుర్తింపు మొద‌ల‌య్యే ప్ర‌యాణం ఎంతో కొత్త‌గా ఉంటుంద‌ని ఆ రోజే విశ్లేషించుకున్నాడు.

అప్ప‌టి నుంచి స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూసాడు. స్టార్స్ తో మంచి ప‌రిచ‌యాలున్నా? ఏ రోజు అడ్వాంటేజ్ తీసుకోలేదు. త‌న ప్ర‌తిభ‌ను న‌మ్మి ఏ స్టార్ పిలిచి అవ‌కాశం ఇస్తే అత‌డితో ప‌నిచేయాల‌నుకున్నాడు త‌ప్ప త‌న‌కు తానుగా ఏ స్టార్ ని ఛాన్స్ అడ‌గ‌లేదు. అలా మారుతి ఓ రోజు ప్ర‌భాస్ క‌ళ్ల‌లో ప‌డ్డాడు.` ప్రేమ క‌థా చిత్రమ్` లో ఎంట‌ర్ టైన్ మెంట్ కు డార్లింగ్ ఫిదా అయిపోయాడు. అప్ప‌టి నుంచి మారుతితో సినిమా తీయాల‌ని మ‌న‌సులో ఉన్నా? పెద్ద‌ డైరెక్ట‌ర్ కాక‌పోవ‌డంతో ఛాన్స్ తీసుకోలేక‌పోయాడు. కాల‌క్ర‌మంలో మారుతి ఎదుగుద‌ల చూసి అత‌డిపై న‌మ్మం క‌లిగింది.

అలా `ది రాజాసాబ్` కార్య రూపం దాల్చింది. ఈ సినిమా విజ‌యంతో మారుతి ఏది అయితే అనుకున్నాడో? అదంతా జ‌రిగేది. కానీ తాను ఒక‌టి త‌లిస్తే దైవం మ‌రోటి త‌లిచింది. `ది రాజాసాబ్` వైఫల్యంతో మారుతి ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడో తెలిసిందే. ఇలా జ‌రుగుతుంద‌ని మారుతి ఎంత మాత్రం ఊహించ‌లేదు. ఏ మాత్రం ఫ‌లితాన్ని ముందే ఊహించినా? కొన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకునే వాడు. ష్యూర్ షాట్ గా రాజాసాబ్ తో తాను అనుకున్న‌ది సాధిస్తాను అనుకున్నాడు. కానీ ఫ‌లితం తేడాగా వ‌చ్చే స‌రికి మారుతి తీవ్ర గంద‌ర‌గోళంలో ప‌డ్డాడు.

ఇప్పుడత‌డు ఎటూ ముందుకెళ్లలేని ప‌రిస్థితుల్లో ఉన్నాడా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చిన్న హీరోకి దిగ‌లేక‌..పెద్ద హీరోతో ముందుకెళ్ల‌లేక మ‌ధ్య‌లో ప‌డిపోయాడు. జీవితంలో ఊహించ‌ని ఓ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో అర్దం కాని ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోతుంటారు. మారుతి ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నాడు.

Tags:    

Similar News