ఘనంగా అల్లు సినిమాస్ ఆరంభం.. తొలి ప్రదర్శన ఆ సీక్వెల్ తోనే!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఆ సినిమాల ద్వారా వచ్చిన సంపాదనను ఏషియన్ గ్రూప్స్ తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ఆరంభిస్తున్న విషయం తెలిసిందే.;
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఆ సినిమాల ద్వారా వచ్చిన సంపాదనను ఏషియన్ గ్రూప్స్ తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ఆరంభిస్తున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికే అల్లు అర్జున్ ఏషియన్ గ్రూప్స్ తో కలసి పలు థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు సినిమాస్ పేరిట సినిమా ప్రేక్షకుడికి ప్రపంచ స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మరో మల్టీప్లెక్స్ థియేటర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒక వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. మరొకవైపు మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేయిస్తూ.. డాల్బీ అట్మాస్ తో టాక్సిక్ , ధురంధర్ 2 సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నారు.
అలా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఆడియన్స్ కి అందిస్తూ.. డాల్బీ విజన్ 3d ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం తో అల్లు సినిమాస్ పేరిట అల్లు స్టూడియోస్ క్యాంపస్లో ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ థియేటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదులోని కోకాపేట గండిపేట ప్రాంతాలను కలుపుతూ హైదరాబాదు పశ్చిమ భాగంలో సినీ ప్రియుల కోసం ఈ అతిపెద్ద స్టూడియో ని నిర్మిస్తున్నారు.. పైగా డాల్బీ సినిమా ఫార్మాట్లో దేశంలోనే అతిపెద్ద 75 అడుగుల వెడల్పు డాల్బీ సినిమా స్క్రీన్ తో రాబోతున్న నేపథ్యంలో ఈ థియేటర్లో సినిమా చూడడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి 19 న ఈ థియేటర్ను గ్రాండ్ గా ఓపెన్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్. డిసెంబర్ 5 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అటు పాకిస్తాన్లో కలెక్షన్ల పరంగా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలలో సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. అదే ధురంధర్ 2. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అవ్వగా ఈ సినిమా టీజర్ కూడా అంచనాలు పెంచేసింది. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా తొలి పరిచయంలో తెరకెక్కింది ఈ సినిమా.ఇందులో ఆర్ .మాధవన్ కీలకపాత్ర పోషించారు.
ఇకపోతే ఈ సీక్వెల్ తోనే గ్రాండ్ గా 2026 మార్చ్ 19న అల్లు సినిమాస్ ప్రారంభం కావాలని అటు సినీ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ భవనం లోపలి భాగం, సీటింగ్ అలాగే లోపల ఉన్న ప్రతిదీ కూడా సిద్ధమైనప్పటికీ, భవనం వెలుపల భావం ఇంకా సిద్ధం కాలేదు. కానీ ఆ నాటికి మొత్తం నిర్మాణం పూర్తి చేసి ఈ ధురంధర్ 2 తో గ్రాండ్ ఓపెన్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అప్పటికి ఈ థియేటర్ నిర్మాణం పూర్తవుతుందో లేదో చూడాలి.