స్పిరిట్.. ప్రకాష్ రాజ్ ఇచ్చిపదేశాడుగా..

సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. 'స్పిరిట్' మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది.;

Update: 2026-02-09 09:15 GMT

సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. 'స్పిరిట్' మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించే కాస్టింగ్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటకు వచ్చింది.

​సాధారణంగా పెద్ద సినిమాల విషయంలో గాసిప్స్ రావడం చాలా కామన్. కానీ కొన్నిసార్లు అవి హద్దులు దాటి నెగెటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తాయి. గత కొద్ది రోజులుగా స్పిరిట్ సెట్స్ లో గొడవలు జరుగుతున్నాయని, ఒక స్టార్ నటుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని నెట్టింట తెగ ప్రచారం జరిగింది. దర్శకుడికి నటుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయంటూ రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. అసలు ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్ లో పడ్డారు.

​అసలు పాయింట్ ఏంటంటే.. నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. ఈ వార్తలను 'ఫేక్ న్యూస్' గా కొట్టిపారేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు తన సీన్ల షూటింగ్ ఇంకా మొదలే కాలేదని, అప్పుడే తప్పుకున్నట్లు వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడ్డారు. వాట్సాప్ ఫ్యాక్టరీల్లో ఇలాంటి కట్టుకథలు అల్లడం మానుకోవాలని చురకలు అంటించారు.

ప్రకాష్ రాజ్ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గొడవలు జరిగాయని, సీరియస్ టెన్షన్స్ ఉన్నాయని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఉండటం ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక ముందుగా రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ​మేకర్స్ కూడా ఈ విషయంలో పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. ఇక షూటింగ్ ఆల్రెడీ ట్రాక్ లో ఉందని, షెడ్యూల్స్ పక్కాగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ సీన్స్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రభాస్ ని ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా స్పిరిట్ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ హైప్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు ఖాయమనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ఇచ్చిన రియాక్షన్ తో నెగెటివ్ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక వచ్చే ఏడాది ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.



Tags:    

Similar News