చిరంజీవి కూడా మర్చిపోయాడు

Update: 2019-01-28 09:10 GMT
ప్రస్తుత టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలందరికి కూడా గురు సమానుడైన స్టంట్‌ మాస్టర్‌ రాజు గారిని సినీ ప్రముఖులంగా కూడా మర్చి పోయారు, టాలీవుడ్‌ కు చెందిన వారంతా కూడా మమ్ముల్ని మర్చి పోయారంటూ ఆయన సతీమణి అనంత లక్ష్మి అన్నారు. ఒంగోలు జిల్లాలోని ఆయన సొంత ఊరిలో 67వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా అనంత లక్ష్మి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎంతో మంది ఆయన వల్ల బతికారు, అప్పట్లో అంతా కూడా గురువు గారు అంటూ పిలిచే వారు. కాని చనిపోయిన తర్వాత మాత్రం మర్చి పోయారని సంచలన ఆరోపణలు చేసింది.

2000వ సంవత్సరం ముందు వరకు టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలందరికి కూడా స్టంట్‌ మాస్టర్‌ గా రాజు వర్క్‌ చేశాడు. ఎన్నో వందల సినిమాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన మాస్టర్‌ రాజు పలు సినిమాల్లో నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్‌ హీరోల సినిమాలకు అప్పట్లో మాస్టర్‌ రాజు చేసిన ఫైట్స్‌ మంచి ఆధరణ దక్కించుకున్నాయి. అప్పుడు స్టార్‌ హీరోలంతా కూడా మా ఆయన్ను గురువుగా గౌరవించేవారు. ప్రస్తుతం టాలీవుడ్‌ లో ప్రముఖ స్టంట్స్‌ మాస్టర్స్‌ గా ఉన్న రామ్‌ లక్ష్మణ్‌ లు కూడా ఆయన దగ్గర శిష్యులుగా చేసిన వారేనని అనంత లక్ష్మి అన్నారు.

నా భర్త చనిపోయి 9 ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ వారు కాని, ప్రభుత్వం వారు కాని పట్టించుకోలేదు. చిరంజీవి కెరీర్‌ ఈస్థాయికి చేరుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాని చిరంజీవి గారు కూడా ఆయన్ను, మమ్ములను మర్చిపోయాడని అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం కాని, ఇండస్ట్రీ వారైనా ఆదుకోవాలని కోరింది.
Tags:    

Similar News