2025: ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీస్ వీరే!

మరి ఈ ఏడాది ఇద్దరు కాస్త ముగ్గురు గా ప్రమోషన్ పొంది.. అంటే తల్లిదండ్రులుగా తమ జీవితంలోకి కొత్తవారికి ఆహ్వానం పలికారు. అలా ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.;

Update: 2025-12-13 19:30 GMT

2025.. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది పూర్తి కాబోతోంది. సినీ ఇండస్ట్రీలో ఎన్నో మరుపురాని సంఘటనలు.. ఈ ఏడాది కొంతమంది వైవాహిక బంధంలోకి అడుగుపెడితే.. మరికొంతమంది విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి ఈ ఏడాది ఇద్దరు కాస్త ముగ్గురు గా ప్రమోషన్ పొంది.. అంటే తల్లిదండ్రులుగా తమ జీవితంలోకి కొత్తవారికి ఆహ్వానం పలికారు. అలా ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

కిరణ్ అబ్బవరం - రహస్య ఘోరక్ :

టాలీవుడ్ యంగ్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు.తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ఘోరక్ తో ఏడడుగులు వేసిన కిరణ్ అబ్బవరం.. ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. రహస్య ఘోరక్ 2025 మే 22న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలో తమ కొడుకుకు "హను అబ్బవరం" అని నామకరణం చేశారు.

కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా:

ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. 2025 జూలై 15న తమ మొదటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు కియారా అద్వానీ. నవంబర్ లో తమ కూతురుకి "సారయా మల్హోత్రా " అని నామకరణం కూడా చేశారు.

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి:

మెగా హీరో వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. 2025 సెప్టెంబర్ 9వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది లావణ్య త్రిపాఠి. ఇక ఇదే ఏడాది అక్టోబర్లో తమ కొడుకుకు "వాయువ్ కొణిదెల" అని నామకరణం కూడా చేశారు. తమ ఇంట్లోకి వారసుడు రావాలి అని కోరుకున్న చిరంజీవి కోరికను నెరవేర్చింది లావణ్య.

రాఘవ్ చద్దా - పరిణీతి చోప్రా:

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా అక్టోబర్ 19 2025న మగ బిడ్డకు జన్మనిచ్చి.. తల్లిదండ్రుల మారారు. ఇక తమ కొడుకుకి "నీర్" అని నామకరణం కూడా చేశారు.

రాజ్ కుమార్ రావ్ - పత్రలేఖ:

రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ 2025 నవంబర్ 15న తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు." ఆడపిల్ల పుట్టింది. ఇది గొప్ప ఆశీర్వాదం " అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాలుగో పెళ్లిరోజు తమకు ఆడపిల్ల పుట్టడం శుభసంకేతంగా తెలిపారు.

విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్:

ప్రముఖ బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2025 నవంబర్ 7న మొదటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత తొలి బిడ్డకు ఆహ్వానం పలకడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

తిరువీర్ - కల్పన:

మసూద వంటి చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న తిరువీర్ గత ఏడాది కల్పనా అనే అమ్మాయితో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది 2025 డిసెంబర్ 12న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. నాయినొచ్చిండు అంటూ పోస్ట్ పంచుకున్నారు.

ఇక వీరితోపాటు మరికొంతమంది ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొంది అభిమానులకు శుభవార్తను తెలియజేశారు.

Tags:    

Similar News