ఉదయించే సూర్యుడి కిరణాలతో పోటీ పడుతున్న బ్యూటీ!
తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలే ఆషిక రంగనాథ్ కి అభిమానులు చాలా ఎక్కువ. అలాంటి ఈమె.;
అభిమానులను అలరించడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో కట్టిపడేస్తున్నారు నేటితరం హీరోయిన్స్. ముఖ్యంగా ఈ జనరేషన్ వారే కాదు ముందు జనరేషన్ హీరోయిన్స్ కూడా ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అకేషన్ ఉన్నా.. లేకపోయినా అందంగా ముస్తాబయి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరగడం అంటే ఆదాయం కూడా పెరిగినట్టే.. కొంతమంది ఇదే సోషల్ మీడియా వేదికగా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు
ఇదిలా ఉండగా తాజాగా ఒక హీరోయిన్ ఉదయాన్నే సూర్యుడి కిరణాలు తాకుతున్న వేళ తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ భిన్న విభిన్నమైన ఫోజులిస్తూ ఫోటోషూట్ నిర్వహించింది. ఆమె ఎవరో కాదు ఆషిక రంగనాథ్. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలే ఆషిక రంగనాథ్ కి అభిమానులు చాలా ఎక్కువ. అలాంటి ఈమె. ఇప్పుడు సూర్యుడితో పోటీ పడుతూ తన అందాన్ని మరింత గ్లోయింగ్ గా మార్చుకుంది. ప్రస్తుతం ఆషికా రంగనాథ్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
కన్నడ , తమిళ్ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆషికా రంగనాథ్ 2016లో వచ్చిన క్రేజీ బాయ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. రాంబో 2 సినిమాలో ప్రధాన పాత్రతో అందరి హృదయాలు దోచుకున్న ఈమె.. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. 2023 ఫిబ్రవరి 10న విడుదల అయిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు ఆరు పదుల వయసు దాటినా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరోల పక్కన హీరోయిన్ లు దొరకడం కాస్త కష్టంగానే మారింది. ఇలాంటి సమయంలో ఆషికా రంగనాథ్ లాంటి యంగ్ బ్యూటీస్ స్టార్ హీరోలతో నటించడానికి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం . ఇప్పటికే నాగర్జున నటించిన నా సామిరంగా సినిమాలో నటించిన ఆషికా రంగనాథ్ ఇప్పుడు చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఆర్టీ 76 సినిమాలో కూడా ఈమె నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. నిజానికి కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న ఈ సినిమాకు మొదట అనార్కలి అనే టైటిల్ ని అనుకున్నారు. కానీ ఆ తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో డింపుల్ హయతితో పాటు ఆషికా రంగనాథ్ కూడా హీరోయిన్గా నటిస్తోంది.