ఫుట్ బాల్ లెజెండ్ మెస్సీతో ఖాన్ వారసుడు సెల్ఫీ
ఒక ఫుట్ బాల్ ఆటగాడి కోసం ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి అంతసేపు ఆసక్తిగా ఎదురు చూసారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీ రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎంతగానో వేచి చూసారు.;
ఒక ఫుట్‌బాల్ ఆటగాడికి భారతదేశంలో ఈ స్థాయి ఫాలోయింగా? అతడి కోసం పడిగాపులు.. ఊక వేస్తే రాలనంత మంది జనం.. గుంపుగా గుమిగూడి.. ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనేంతగా పరిస్థితులు మారిపోవడం.. ఇదంతా చూస్తుంటే ఆ క్రీడాకారుడిలో అంతగా ఏం ఉంది?
ఒక ఫుట్ బాల్ ఆటగాడి కోసం ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి అంతసేపు ఆసక్తిగా ఎదురు చూసారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీ రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎంతగానో వేచి చూసారు. శనివారం(13 డిసెంబర్) ఉదయం కోల్ కతాలో సందడి చేసిన మెస్సీ సాయంత్రానికి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కి వస్తున్నారు! అనగానే అక్కడ కోలాహాలం ఆకాశాన్నంటింది. ముంబై, దిల్లీ, కోల్ కత, బెంగళూరులోనే కాదు హైదరాబాద్ లోను మెస్సీకి అసాధారణ ఫాలోయింగ్ ఉందని తాజా ఈవెంట్ నిరూపించింది.
ఆసక్తికరంగా మెస్సీ కోల్ కతాలో అడుగుపెట్టగానే, అతడి చుట్టూ సెలబ్రిటీలే గుమిగూడారు. అతడితో ఫోటో కోసం, సెల్ఫీ కోసం పాకులాడిన వాళ్లు కూడా సెలబ్రిటీలే. ఈ సెలబ్స్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అతడి కుమారుడు అబ్రమ్ ఖాన్ కూడా ఉన్నారు. ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీని కలిసేందుకు షారూఖ్ - అబ్రమ్ జోడీ చాలా ముందే కోల్‌కతా చేరుకుని అక్కడ ఎదురు చూసారు. శనివారం తెల్లవారుజామున కోల్‌కతా విమానాశ్రయానికి ఖాన్ చేరుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
షారూఖ్ ను చూడటానికి అభిమానులు విమానాశ్రయంలో ఎంట్రీ గేటు వెలుపల గంటల పాటు వేచి చూసారు. అయితే ఆ జనం ఎంత ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నారో, అంతకంటే ఎక్కువ ఎగ్జయిట్ మెంట్ తో షారుఖ్ ఖాన్, అతడి చిన్న కుమారుడు అబ్రామ్ ఖాన్ అంతే ఉత్కంఠగా మెస్పీ రాక కోసం వేచి చూసారు. ఎట్టకేలకు మెస్సీతో షారూఖ్ భేటీ కుదిరింది. అబ్రామ్ తన ఫేవరెట్ ఫుట్ బాల్ స్టార్ మెస్సీతో సెల్ఫీ దిగాడు. ఆ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఫోటో ఆఫ్ ది డే! అంటూ ఈ ఫోటోగ్రాఫ్ ని షారూఖ్ అభిమానులు జోరుగా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు షారూఖ్, అబ్రామ్ తో పాటు, ఖాన్ మేనేజర్ పూజ్ దద్లాని కూడా అటెండయ్యారు. పూజా తన కుమార్తెతో కలిసి స్టేడియంలో కనిపించింది. కొన్ని వీడియోలను గమనిస్తే,.. షారూఖ్ చుట్టూ గట్టి భద్రత ఉండగా, విమానాశ్రయం నుండి వేగంగా బయటకు వస్తూ కనిపించారు. తండ్రీకొడుకులు షారూఖ్- అబ్రమ్ ఇద్దరూ వెళ్ళేటప్పుడు ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు.
గతంలో షారుఖ్ ఖాన్ కోల్‌కతాలో మెస్సీని కలిసే ఛాన్సుందని హింట్ ఇచ్చాడు. కానీ ఎప్పుడూ ధృవీకరించలేదు. మొన్నటి రోజున షారుఖ్ సోషల్ మీడియాలలో అభిమానులను ఆటపట్టిస్తూ ఒక కార్యక్రమంలో ఫుట్‌బాల్ స్టార్‌తో వేదికను షేర్ చేసుకుంటాని చెప్పాడు. డిసెంబర్ 13న సాల్ట్ లేక్ స్టేడియంలో ఇది పాజిబుల్ అని రాసాడు. ఆ తర్వాత ఎక్స్ ఖాతాలో మెస్సీతో కలిసి స్టేడియంలో వాక్ చేస్తాను అని స్వయంగా ఖాన్ చెప్పాడు. ఎట్టకేలకు మెస్సీని కలిసాడు.. ఖాన్ కవాతు చేసాడు. కానీ ఈవెంట్లో ఊహంచని ఘటనలు షాకిచ్చాయి.
మెస్సీ ఈరోజు సాయంత్రమే హైదరాబాద్ కు చేరుకున్నారు. అంతకుముందు లెజెండరీ ఆటగాడు మెస్సీ కోల్‌కతాలో శనివారం తెల్లవారుజామున దిగాడు. అంతర్జాతీయ టెర్మినల్‌కు మెస్సీ రాకతో అభిమానుల నినాదాలు మిన్నంటాయి. జనం విరుచుకుపడబోయారు. అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య మెస్సీని వీఐపీ గేటు గుండా బయటకు తీసుకెళ్లడంతో అభిమానులు నిరాశ చెందారు. మెస్సీని హోటల్‌కు తీసుకెళ్లడానికి భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేసారు. అయితే అక్కడ అతడి కోసం భారీ జనసమూహం వేచి ఉండటంతో తోపులాటలు జరిగాయి.
`GOAT ఇండియా టూర్ 2025` పేరుతో ఈరోజు కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ ప్రారంభమైంది.
మెస్సీ ఇండియా టూర్ ప్రణాళిక ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. కోల్‌కతాలో తన మొదటి పర్యటనను ముగించిన లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ను నేటి సాయంత్రం సందర్శించారు. తదుపరి ముంబై, ఢిల్లీలను కూడా సందర్శించనున్నారు. సోమవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలవనున్నారు.