దోపీడి దొంగ‌లు చంపేస్తార‌నుకున్నా!

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు శ‌త్రుజ్ఞు సిన్హా సినిమా-రాజ‌కీయ జీవితం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు .;

Update: 2025-12-13 14:30 GMT

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు శ‌త్రుజ్ఞు సిన్హా సినిమా-రాజ‌కీయ జీవితం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు . రెండు రంగాల్లోనూ స‌క్సెస్ అయిన లెజెండ్. న‌ట‌ప్ర‌స్తానం నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగిన వైనం ఎంతో స్పూర్తి దాయ‌కం. రాజ‌కీయం లో బిజీ అయిన త‌ర్వాత సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. చేతిలో స‌మ‌యం ఉంటే త‌ప్ప సినిమాల వైపు చూడం లేదు. తాజాగా ఆరేళ్ల అనంత‌రం మ‌ళ్లీ బాలీవుడ్ లో కంబ్యాక్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్ట్ షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే?

ఆయ‌న జీవితంలో చోటు చేసుకున్న ఓ భయాన‌క సంఘ‌ట‌న గురించి తాజాగా గుర్తు చేసుకున్నారు. `న్యూయార్క్ వెళ్లిన స‌మ‌యంలో రాడిస‌న్ హోట‌ల్ లో బ‌స‌ చేసాను. అక్క‌డే ఉన్న నా స్నేహితురాలు రాత్రి డిన్న‌ర్ కు ఆహ్వానించింది. డిన్న‌ర్ అనంత‌రం షాపింగ్ చేసుకుని తిరిగి హోట‌ల్ కి బ‌య‌ల్దేరాను. అప్ప‌టికే స‌మ‌యం అర్ద‌రాత్రి ఒంటిగంట అవుతుంది. స్నేహితురాలు కారులో హోటల్ కి స‌మీపంలో డ్రాప్ చేసి వెళ్లిపోయింది. అప్పుడు బ్యాగ్ లు ఖ‌రీదైన వ‌స్తువులున్నాయి. గంట పాటు న‌డిచినా హోటల్ క‌నిపించ‌లేదు.

అక్క‌డ ఎటు చూసినా ఒకేలా ఉంది. అదంతా దొంగ‌లు సంచ‌రించే ప్రాంత‌మ‌నే పేరుంది. దీంతో నాకు భ‌య‌మే సింది. హోట‌ల్ కి దారెటు అని ఓ వ్య‌క్తిని అడిగితే విసిగించుకుని వెళ్లిపోయాడు. ప‌ర‌స్థితి మ‌రింత భ‌యాన‌కంగా మారుతుంది. చిక‌టిగా ఉండ‌టంతో నాలో భ‌యం పెరిగిపోతుంది. అదే నా చివ‌రి రోజు అనిపించింది. అదే స‌మ‌యంలో ఓ కారు నా ముందుగా వెళ్లింది. అందులో దోపీడి దొంగ‌లు ఉన్నార‌ని, న‌న్ను చంపి బ్యాగ్ తీసుకుని పోతార‌ని భ‌య‌ప‌డ్డా.

అప్పుడే కారులో నుంచి డ్రైవ‌ర్ దిగి మీరు` పుట్ జ‌ట్ట‌న్ దే`లో న‌టించారు క‌దా? అని అన్నాడు. అత‌డు అలా అన‌గానే నాకు ధైర్యం వ‌చ్చింది. న‌న్ను గుర్తు ప‌ట్టాడ‌ని అర్ద‌మైంది. అత‌డికి అక్క‌డ ప‌రిస్థితి తెలిసు కాబ‌ట్టి వెంట‌నే అత‌డి స్నేహితుల్ని పిలిపించి కారులో హోటల్ వ‌ద్ద దింపారు. అప్పుడు వాళ్ల‌కు డ‌బ్బులు ఇస్తుంటే వారు తీసుకోలేదు. ఆ రోజు జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన`న్నారు.

Tags:    

Similar News