డోస్ పెరిగిన యాక్షన్.. 'అతి' కాదు అంతకుమించి..!
కమర్షియల్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని మాస్ ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఐతే కొన్నిసార్లు అది శృతిమించినట్టు అనిపించినా ఆడియన్స్ కోసమే కదా అని యాక్సెప్ట్ చేస్తారు.;
కమర్షియల్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని మాస్ ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఐతే కొన్నిసార్లు అది శృతిమించినట్టు అనిపించినా ఆడియన్స్ కోసమే కదా అని యాక్సెప్ట్ చేస్తారు. ఐతే అన్ని కమర్షియల్ సినిమాలు ఒక లెక్క అయితే బోయపాటి శ్రీను మాస్ సినిమాలు మరో లెక్క. బోయపాటి యాక్షన్ చెప్పాడంటే సినిమాలో కేవలం యాక్షన్ అంశాలు మాత్రమే అనేలా ఉంటాయి. కథ కథనాల్లో లాజిక్ లు గట్రా ఏవి ఉండవు అంతే. అఫ్కోర్స్ జనాలు చూస్తున్నారు ఆయన చేస్తున్నారు దానిలో తప్పేముంది అనుకోవచ్చు.
బోయపాటి సినిమాలన్నీ యాక్షన్ మేజర్ హైలెట్..
ఐతే సినిమా సినిమాకు బోయపాటి తన మాస్ పంథాని పెంచుకుంటూ వస్తున్నారు. భద్ర సినిమా మంచి కథకు యాక్షన్ తోడైంది.. ఆ తర్వాత బోయపాటి సినిమాలన్నీ యాక్షన్ మేజర్ హైలెట్ అవుతూ వచ్చాయి. ఐతే ఎప్పుడైతే బాలకృష్ణతో బోయపాటి కాంబో సెట్ అయ్యిందో ఇక ఆ కలయిక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సింహా నుంచి ఈ ఇద్దరి కాంబో సినిమా అంటే చాలు నందమూరి ఫ్యాన్స్ మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ రుచి చూస్తూ వచ్చారు.
అఖండ వరకు బోయపాటి, బాలయ్య సినిమా అంటే మాస్ ఆడియన్స్ కూడా సినిమాలో మిగతా విషయాలు ఎలా ఉన్నా యాక్షన్ సీన్స్ అదుర్స్ అనేలా వచ్చాయి. కానీ లేటెస్ట్ రిలీజ్ అఖండ 2 సినిమా పై మాత్రం విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. బోయపాటి బాలయ్య ఈ కాంబోలో వచ్చిన అఖండ 2 తాండవం సినిమా కొన్ని పార్ట్ లో అది కూడా కొన్ని డైలాగ్స్ లో ఓకే అనిపించగా మిగతా అంతా కూడా నథింగ్ న్యూ అనేలా చేసుకుంది.
వారికి అఖండ 2 బాగా దొరికేసింది..
ఇక యాక్షన్ సీన్స్ అయితే బాబోయ్ ఏంటిది అనిపించేలా చేశాయి. ఆల్రెడీ బోయపాటి శ్రీను యాక్షన్ సినిమాల్లో కొన్ని సీన్స్ ని మీంబర్స్, ట్రోలర్స్ తెగ ఆడేసుకుంటారు. ఐతే ఇప్పుడు వారికి అఖండ 2 బాగా దొరికేసింది. ఈ సినిమాలో బోయపాటి యాక్షన్ పాళ్లు ఎక్కువవడం వల్ల అతి అనేస్తున్నారు ఆడియన్స్. అఖండ 2 యాక్షన్ అదే మాస్ అతిపై విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి.
యాక్షన్ సినిమాలు అవసరమే.. నిజంగానే ఒక మాస్ కటౌట్ కి సరైన యాక్షన్ సీన్స్ పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి కానీ వాళ్లకి డౌట్ వచ్చేలా చేయకూడదు. ముఖ్యంగా అసలు ఇది ఎలా పాజిబుల్ అనే సీన్స్ ఒకటి రెండు వస్తే పర్లేదు. కానీ సినిమా అంతా అలానే ఉంటే మాత్రం ఒక రేంజ్ లో ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
ప్రస్తుతం అఖండ 2 సినిమా ఒక ట్రోలింగ్ పాయింట్ అయ్యింది. నందమూరి ఫ్యాన్స్ కి ఈ సినిమాలో బాలయ్య యాక్షన్, డైలాగ్స్ చూసి ఆహా అనేస్తుండగా కామన్ ఆడియన్స్ మాత్రం డిజప్పాయింట్ అయ్యారు. ఐతే సినిమాలో యాక్షన్ సీన్స్ ని ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు నెటిజెన్లు.