సామ్-రాజ్: పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి కెమెరాకు

సమంత - రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల‌ సమక్షంలో వివాహం చేసుకున్నారు. సమంత సోషల్ మీడియాలో ఒక స్వీట్ నోట్‌తో ఈ వార్తను ధృవీకరించింది.;

Update: 2025-12-13 18:34 GMT

సమంత - రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల‌ సమక్షంలో వివాహం చేసుకున్నారు. సమంత సోషల్ మీడియాలో ఒక స్వీట్ నోట్‌తో ఈ వార్తను ధృవీకరించింది. ఇది నిరాడంబర వివాహ వేడుక. కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో లింగ భైరవ వివాహ పద్ధతిలో పెళ్లాడ‌టం చ‌ర్చ‌గా మారింది. పెళ్లి త‌ర్వాత‌ ఈ నూతన వధూవరులు మొదటిసారిగా ముంబైలో కలిసి కనిపించారు.

శనివారం మ‌ధ్యాహ్నం సమంత-రాజ్ ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరుతున్నప్పుడు పెళ్లి తర్వాత మొదటిసారిగా కెమెరాలకు చిక్కారు. ఇద్దరూ సాధారణ దుస్తులలో సింపుల్ గా ఉన్నారు. ఆ స‌మ‌యంలో స‌మంత‌- రాజ్ జంట‌కు ఫోటోగ్రాఫ‌ర్లు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేయగా.. దానికి వారు కృతజ్ఞతలు తెలియజేసారు.

సమంత అక్కినేని నాగ చైతన్య నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చైత‌న్య న‌టి శోభిత ధూళిపాల‌ను పెళ్లాడారు. రాజ్ నిడిమోరు 2015లో శ్యామలి దేను వివాహం చేసుకున్నారు. వారు 2022లో విడిపోయినట్లు భావిస్తున్నారు. సమంత - రాజ్ సంబంధం గురించి పుకార్లు గ‌త ఏడాది ప్రారంభమయ్యాయి. అప్ప‌టి నుంచి పుకార్లు ఆగ‌లేదు. ఆ ఇద్ద‌రూ దేనినీ దాచుకోలేదు. బహిరంగ కార్యక్రమాలలో కలిసి కనిపించారు.. కలిసి నివసిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇద్దరూ తమ సంబంధం గురించి మౌనంగా ఉన్నారు. సమంత నిరంత‌రం త‌న అభిమానుల‌ను టీజ్ చేసినా వివ‌రాల‌ను గోప్యంగా దాచారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లలో రాజ్ పేరును ప్ర‌స్థావిస్తున్నా, కానీ దానిని అధికారికంగా ఏనాడూ ధృవీక‌రించ‌లేదు.

`ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` సెట్స్‌లో మొద‌టిసారి సామ్- నిడిమోరు కలుసుకున్నారు. సిరీస్ ముగిసినా త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేసారు. అదే క్ర‌మంలో ఈ జంట న‌డుమ స్నేహం ప్రేమ‌గా మారింది. సిటాడెల్ హ‌నీ బ‌న్నీ కోసం ఏడాది పాటు క‌లిసి ప‌ని చేసారు. ఆ త‌ర్వాత రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ర‌క్త్ బ్ర‌హ్మాండ్ వెబ్ సిరీస్ లోను స‌మంత న‌టిస్తోంది. ఈ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి , జైదీప్ అహ్లావత్ త‌దిత‌రులు ఈ సిరీస్‌లో నటించారు. ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News