స్టార్ డైరెక్ట‌ర్ వార‌సురాలు పెళ్లి క‌హానీ

Update: 2019-10-01 07:29 GMT
అఖిల్ స‌ర‌స‌న హ‌లో చిత్రంలో న‌టించింది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని. తొలి ప్ర‌య‌త్న‌మే క్యూట్ చ‌బ్బీ గాళ్ కుర్ర‌కారు గుండెల్లో చోటు సంపాదించింది. ఆ త‌ర్వాత‌ సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న చిత్ర‌ల‌హ‌రి.. శ‌ర్వానంద్ స‌ర‌స‌న ర‌ణ‌రంగం చిత్రాల్లోనూ న‌టించింది. ప్ర‌తిసారీ ఈ అమ్మ‌డిలో ఏదో ప్ర‌త్యేక‌త ఉంద‌ని క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఆఫ్ ద స్క్రీన్ కెరీర్ ఈ అమ్మ‌డికి పెద్ద ప్ల‌స్ అయ్యింది. కెరీర్ ఆరంభం ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా ప‌ని చేసిన అనుభ‌వం క‌ళ్యాణికి ఉంది. క్రిష్ 3 చిత్రానికి సాబు సిరిల్ వ‌ద్ద ప‌ని చేసింది. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సినిమాకి అసిస్టెంట్ క‌ళా ద‌ర్శ‌కురాలిగానూ ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే.

ర‌క‌ర‌కాల అనుభ‌వాలు ఉండ‌టం వ‌ల్ల‌నే.. కెరీర్ ఆరంభ‌మే జెట్ స్పీడ్ తో దూసుకొచ్చింది. క్యూట్ లుక్స్.. పెర్ఫెక్ట్ పెర్ఫామెన్స్ తో క‌ళ్యాణి ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే నాలుగేళ్ల కెరీర్ పూర్త‌యిపోయింది. ఇక ఈ అమ్మ‌డు త‌న కెరీర్ ని టేకాఫ్ చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఆ క్ర‌మంలోనే త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఓ సినిమా మ‌ల‌యాళంలోనూ తండ్రి ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మ‌ర‌క్కార్ చిత్రంలోనూ ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో న‌టిస్తూ బిజీగా ఉంది అమ్మ‌డు. మ‌రోవైపు తెలుగు-త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న‌కు క‌థ‌లు వినిపించేవ‌న్నీ వినేస్తోంద‌ట‌.

ఇంత‌కీ పెళ్లెప్పుడు? అని అడిగేస్తే మాత్రం క‌ళ్యాణి ఓపెన్ అవ్వ‌డం లేదు. వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్ని ప‌రిశీలిస్తే ఈ అమ్మడు మ‌ల‌యాళ‌ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కొడుకు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ తో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే అవ‌న్నీ రూమ‌ర్లు అంటూ క‌ళ్యాణి త‌న‌కు తానుగానే ప్ర‌క‌టించింది. ``నేను ఓ కుర్రాడితో డేటింగులో ఉన్నా... అత‌డినే పెళ్లాడుతా... కానీ దానికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది`` అంటూ క‌ళ్యాణి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక డేటింగులో ఉన్న కుర్రాడు ఎవ‌రో త‌న కుటుంబంలో అంద‌రికీ తెలుసున‌ని క‌న్ క్లూజన్ ఇచ్చింది. ఇంట్లో అంద‌రికీ అంగీకార‌మే కాబ‌ట్టి పెళ్లికి అభ్యంత‌రాలేవీ ఉండ‌వ‌ని తెలిపింది.
Tags:    

Similar News