రోమియోను రంజు రంజుగా మారుస్తున్నారే!

ఓ లేడీ గ్యాంగ్ ను లీడ్ చేసే రోల్ తో ఆక‌ట్టుకుంటుందంటున్నారు. అలాగే దిశా ప‌టానీ, విక్రాంత్ మాసే కూడా ప్రాజెక్ట్ లో భాగ‌మ‌వుతున్నారు. సినిమాలో ఈ రెండు పాత్ర‌లు కూడా ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటాయ‌ని తెలుస్తోంది.;

Update: 2025-12-20 18:30 GMT

షాహిద్ కపూర్, త్రిప్తీ డిమ్రీ జంట‌గా విశాల్ భ‌ర‌ద్వాజ్ `ఓ రోమియో` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న చిత్రం కొంత పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఇప్పుడీ ప్రాజెక్ట్ లో మ‌రింత మంది నటుల్ని రంగంలోకి దించుతున్నారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ఓ కీల‌క పాత్ర బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇందులో త‌మ‌న్నా? మ‌రోసారి త‌న‌దైన ఒంపు సొంపుల‌తో కుర్ర‌కారును ఆక‌ట్టుకోవ‌డం ఖాయం అంటున్నారు. ఈ పాత్ర బోల్ట్ గా ఉంటుంద‌ని స‌మాచారం.

ఓ లేడీ గ్యాంగ్ ను లీడ్ చేసే రోల్ తో ఆక‌ట్టుకుంటుందంటున్నారు. అలాగే దిశా ప‌టానీ, విక్రాంత్ మాసే కూడా ప్రాజెక్ట్ లో భాగ‌మ‌వుతున్నారు. సినిమాలో ఈ రెండు పాత్ర‌లు కూడా ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటాయ‌ని తెలుస్తోంది.దీంతో తెరంతా రంగుల మ‌యంగా ఉంటుంద‌ని చెప్పొచ్చు. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి .షాహిద్ క‌పూర్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నేప‌థ్యంలో అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి.షాహిద్ క‌పూర్ -విశాల్ భ‌ర‌ద్వాజ్ కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే రెండు సినిమాలు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

`క‌మీనే`, `హైద‌ర్` చిత్రాలు రెండు మంచి విజ‌యం సాధించాయి. దీంతో ఈ ద్వ‌యం హ్యాట్రిక్ పై క‌న్నేసింది. అందుకు త‌గ్గ‌ట్టే సినిమాపై బ‌జ్ నెల‌కొంది. అన్ని ప‌నులు పూర్తి చేసి చిత్రాన్ని ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయ‌నున్నారు. ఇక త‌మ‌న్నా విష‌యానికి వ‌స్తే? `ఓ రోమియో`తో పాటు హిందీలో మ‌రో మూడు సినిమాలు న‌టిస్తోంది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, `రేంజర్` అనే మ‌రో సినిమాలో న‌టిస్తోంది. వీటితో పాటు `వి. శాంతారం` అనే చిత్రంలోనూ నూటిస్తోంది. ఈ సినిమాల‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మ‌రో వైపు `వివాన్` అనే చిత్రంలో కూడా న‌టిస్తోంది. ఈ సినిమాల‌న్నీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఈ ఏడాది త‌మ‌న్నా న‌టించిన రెండు సినిమా లే రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన `ఓదెల 2 ` బాక్సాఫీస్ అంచ‌నాలు తారుమారు చేసింది. `రైడ్ 2` స్పెష‌ల్ సాంగ్ తోనే ప్రేక్షకు ల్ని అల‌రించింది. 2026 లో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ ల‌తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయం.

Tags:    

Similar News