మాస్ మహారాజాలో ఇంత మార్పా?
ఈ మూవీ కోసం ఇప్పటి వరకు రవితేజ అసలు పారితోషికమే తీసుకోదని నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పడం పలువురిన ఆశ్చర్యానికి గురి చస్తోంది.;
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `భక్త మహాశయులకు విజ్ఞప్తి`. కిషోర్ తిరుమల దర్శకుడు. నానితో `ద ప్యారడైజ్` వంటి పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. అషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్‌లు నటించిన ఈ మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. రవితేజ మార్కు యాక్షన్‌కు పూర్తి భిన్నంగా చేసిన సినిమా ఇది. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా మాస్ మహారాజా రవితేజ గురించి నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆసక్తికర విషయాల్ని తాజాగా వెల్లడించారు. ఒక దశలో రెమ్యునరేష్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా అనుకున్న ప్రకారం నిర్మాతల నుంచి పారితోషికాన్ని వసూలు చేయడం అలవాటుగా పెట్టుకుని రవితేజ ఈ సినిమా విషయంలో మాత్రం మెట్టు దిగాడని తెలిసింది. తన ప్రతి సినిమాకు ముందే రెమ్యునరేష్‌ని వసూలు చేసే రవితేజ ఈ సినిమాకు మాత్రం అలా చేయలేదని చెబుతున్నారు.
ఈ మూవీ కోసం ఇప్పటి వరకు రవితేజ అసలు పారితోషికమే తీసుకోదని నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పడం పలువురిన ఆశ్చర్యానికి గురి చస్తోంది. ఈ మూవీని ప్రారంభించాడనికి ముందే సంక్రాంతి బరిలో నిలవాలని ప్లాన్ చేసుకున్నారట. ఆ ప్లాన్ ప్రకారమే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వర్కవుట్ అవుతున్నాయని భావించి పక్కా ప్లాన్ ప్రకారమే బరిలోకి దిగుతున్నారట.
ఆ ప్లాన్‌లో భాగంగానే హీరో రవితేజ సినిమా పూర్తయ్యే వరకు తన పారితోషికం తీసుకోలేదట. మరి లాభాల్లో వాటా కోసం పారితోషికం తీసుకోకుండా రవితేజ వర్క్ చేశాడో.. లేక ప్రస్తుత పరిస్థికి తగ్గి పారితోషికం డిమాండ్ చేయకుండా సినిమా చేసేడో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఇందులో రవితేజ ఓ భార్య, ప్రియురాలు మధ్య నలిగే వ్యక్తిగా నటించాడు. చెప్పాలంటే వెంకీ మామ తరహా సినిమా అన్నమాట. మాస్ రాజాలో ఇంత మార్పుని చూసిన ఇండస్ట్రీ వర్గాలు మాస్ రాజాలో ఇంత మార్పా అని అవాక్కవుతున్నారని ఇన్ సైడ్ టాక్.