స్టార్ కిడ్స్ ఇన్ స్టా 'అన్ ఫాలోయింగ్' చర్చనీయాంశం
ఈమద్య కాలంలో స్టార్స్ కిడ్స్ ఇన్ స్టా గ్రామ్ లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వకుండా లక్షల్లు ఫాలోవర్స్ ను దక్కించుకుంటున్నారు. కొందరు అయితే ఏకంగా మిలియన్ ల మంది ఫాలోవర్స్ ను కూడా కలిగి ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ మనవడు అగస్త్యా నందన్ కూడా ఇన్ స్టా గ్రామ్ లో జాయిన్ అయ్యాడు. ఈయన బాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చే విషయమై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బి అభిమానులు ఈయన్న తెగ ఫాలో అవుతున్నారు.
రెండు రోజుల్లోనే దాదాపుగా 50 వేల మంది ఫాలోవర్స్ ను దక్కించుకున్న అగస్త్యా ను షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఫాలో అయ్యింది. అగస్త్యాను ఫాలో అయిన ఒక్క రోజులోనే సుహానా ఖాన్ అతడి ఒక ఫొటోకు అన్ ఫాలోయింగ్ అనే కామెంట్ ను పెట్టింది. మామూలుగా అయితే ఇష్టం లేకుండా సింపుల్ గా అన్ ఫాలో అవుతారు. కాని సుహానా ఖాన్ అన్ ఫాలోయింగ్ అంటూ కామెంట్ పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వీరిద్దరు చాలా కాలంగా మంచి స్నేహితులు. చిన్నప్పటి నుండి కలిసి చదువుకోవడంతో పాటు పలు సందర్బాల్లో పార్టీల్లో వీరు కలిశారు. ఇద్దరి మద్య మంచి స్నేహం ఉంది. ఇలాంటి సమయంలో సుహానా ఖాన్ ఎందుకు అన్ ఫాలోయింగ్ అంటూ కామెంట్ పెట్టింది అనేది అర్థం కావడం లేదు అంటూ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.