Tupaki Exclusive: నేను కావాలని ప్లాన్ చేయలేదు.. విశ్వక్ సేన్ 'కల్ట్' సీక్రెట్స్
స్క్విడ్ గేమ్ కంటే ముందే ఇలాంటి ఒక సర్వైవల్ అండ్ సైకలాజికల్ గేమ్ ఐడియా తన బుర్రలో ఉందని, దాన్ని ఒక రేసీ థ్రిల్లర్ లా రెండున్నర గంటల పాటు ఆడియన్స్ కు ఎక్స్ పీరియన్స్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశానని విశ్వక్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ దర్శకుడిగా మరోసారి మెగాఫోన్ పట్టిన సినిమా 'కల్ట్'. స్క్విడ్ గేమ్ కంటే ముందే ఇలాంటి ఒక సర్వైవల్ అండ్ సైకలాజికల్ గేమ్ ఐడియా తన బుర్రలో ఉందని, దాన్ని ఒక రేసీ థ్రిల్లర్ లా రెండున్నర గంటల పాటు ఆడియన్స్ కు ఎక్స్ పీరియన్స్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశానని విశ్వక్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తుపాకీ.కామ్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో కల్ట్ మూవీ మేకింగ్, అందులోని ఛాలెంజెస్, జపనీస్ రిలీజ్ ప్లాన్స్ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
ఒక డైరెక్టర్ గా సెట్స్ లో 150 మందిని ఒకేసారి హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదని, పీపుల్ మేనేజ్మెంట్ తో పాటు సీన్ పై ఫోకస్ పెట్టడం చాలా పెద్ద ఛాలెంజ్ అని విశ్వక్ చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకు ముందు దర్శకుడిగా ఉన్న అనుభవం వల్ల సెట్స్ లో ఎవరితో ఆర్గ్యూమెంట్స్ రాకుండా, చాలా ఓపిగ్గా అందరినీ ఎలా హ్యాండిల్ చేయాలో తనకు బాగా తెలుసన్నాడు. బయట జరిగే నెగిటివిటీ లేదా కాంట్రవర్సీల గురించి అడిగినప్పుడు.. వాటికి అటెన్షన్ ఇవ్వకపోవడమే బెస్ట్ సొల్యూషన్ అని, మనం రియాక్ట్ అయితే జనాలు ఆ అటెన్షన్ ను ఎంజాయ్ చేస్తారని చాలా మెచ్యూర్డ్ ఆన్సర్ ఇచ్చాడు.
పాన్ ఇండియా కాన్సెప్ట్ పై తనదైన శైలిలో స్పందిస్తూ.. మనం కావాలని ప్లాన్ చేసి పాన్ ఇండియా సినిమా తీయలేమని తేల్చి చెప్పాడు. ముందు నిజాయితీగా ఒక సినిమా తీస్తే, అప్పుడు ఆ కంటెంట్ డిసైడ్ చేస్తుందని అది ఏ ఏ భాషల్లోకి వెళ్లాలో అన్నాడు. అయితే 'కల్ట్' సినిమా గేమింగ్ కల్చర్ బేస్డ్ గా ఉండటం వల్ల, జపనీస్ అండ్ కొరియన్ వైబ్స్ తో దీన్ని జనవరి లేదా ఫిబ్రవరిలో జపనీస్ భాషలో కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉందని రివీల్ చేశాడు. జపనీస్ లో తనను తాను స్క్రీన్ పై చూసుకోవాలని ఉందంటూ సరదాగా కామెంట్ చేశాడు.
రెండు గంటల 22 నిమిషాల రన్ టైమ్ తో పక్కా ప్యాక్డ్ గా ఈ సినిమా రాబోతోందని విశ్వక్ చెప్పాడు. కేవలం కథ మాత్రమే కాకుండా సెకండ్ హాఫ్ లో 25 నుంచి 30 నిమిషాల పాటు ఆడియన్స్ కు ఒక సాలిడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ఉంటాయని ప్రామిస్ చేశాడు. తన పర్సనల్ లైఫ్ లో ఫ్రెండ్ షిప్ కిచ్చే వాల్యూ గురించి చెబుతూ.. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని, తన లైఫ్ లో ఏం జరిగినా చిన్నప్పటి నుంచి ఉన్న ఒక పది పదిహేను మంది స్నేహితులు మాత్రమే తనతో ఉంటారని ఎమోషనల్ అయ్యాడు.
డైరెక్షన్ చేయడం తాను బాగా ఎంజాయ్ చేస్తానని చెబుతూనే, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎప్పుడూ యాక్టింగ్ కే ఉంటుందని విశ్వక్ స్పష్టం చేశాడు. తన దగ్గరికి ఎవరైనా మంచి సినాప్సిస్ తో వస్తే, ఇంటర్నెట్ లో అప్రోచ్ అయినా కూడా తాను ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు. అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ గా నిలిచిపోతుందని విశ్వక్ గట్టి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.